Pages

5, జూన్ 2013, బుధవారం

ఇంటర్మీడియెట్ చదువు కి అంత ఖర్చు అవసరమా..!



10 వ తరగతి పాసవడం తోనే గ్రామాల్లో వున్న పిల్లలతో సహా యే చైతన్య ...నారాయణ లాంటి కార్పోరేట్  కాలేజీల్లో చేరడానికి ప్రయత్నిస్తున్నారు.ఒకవేళ వీళ్ళు అలా అనుకోక పోయిన ఆయా కాలేజీల PRO లు అడ్రస్ కనుక్కొని మరీ పిల్లల ఇంటిముందు వాలిపోయి వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు.కాస్త మంచి మార్కులు వచ్చిన వారికి మొదటి సంవత్సరం కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారు.ఆ తరవాత అదీ..ఇదీ..అనిచెప్పి ఫీజులు అందరలాగానే వసూలు చేస్తారు.

మొత్తం వెయ్యి మంది ఒక బ్రాంచి లో చేరితే కనీసం దాంట్లో ఓ వంద మంది సూపర్ బ్రిలియంట్లు వుండక పోరు కదా..వాళ్ళనే అరగదీసీ..దీసీ..రిసల్ట్స్ వచ్చినతరవాత పేపర్లలో..టి.వి.ల్లో వాళ్ళ మొఖాలతో advertisement చేసుకొంటారు. మా కొలీగ్ ఒకాయన ఏడాదికి 50 వేలు చొప్పున  కట్టి ఓ పెద్ద కాలేజీలో చదివించాడు.తీరా చివరికి చూస్తే లోకల్ లో ప్రభుత్వ కళాశాల లో చదివిన కుర్రాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి.కాని గవర్నమెంటు కాలేజీ లక్షలు పోసి వాళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోగలదా..!

అసలు ఇంటర్మీడిఎట్ కి ఓ లక్ష చిల్లర డబ్బులు పోసి చదివించేది ఎక్కువగా మన వాళ్ళేనేమోనని నాకో సందేహం..!ఏ రాష్ట్రం లోనూ ఈ వేలం వెర్రి లేదు.ఇంజనీర్..డాక్టర్ తప్ప మరేవీ.. మరేవీ వృత్తులు కానట్టు భావించే వెంగళప్పల వల్లనే ఈ తిప్పలు.ఇప్పుడు ప్రస్తుతం C.A. మానియా నడుస్తోంది.

ఆయా వృత్తిదారులు దారులు తయారవుతున్నారు తప్ప దాంట్లో కొత్త పరిశోధనలు చేసే ఆసక్తి గలవారు..మేధో సంపత్తి వుండి డబ్బు లేమి కారణంగా వెనుకబడిపోతున్నారు.ఎవరికి ఏ రంగంలో నిజమైన ఆసక్తి ఉందో దాంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయా రంగాల్లో నూతన ఆవిష్కరణలు చేస్తారు.దేశం గర్వించదగ్గ కళాకారులు..వృత్తి నిపుణులు తయారవుతారు తప్ప సూడో prestige ల కోసం ధనం పోసి సీట్లు కొనుక్కునే వారు అత్తెసరుగా మిగిలిపోతారు.  
  

1 కామెంట్‌: