Pages

7, జూన్ 2013, శుక్రవారం

తెలుగు హీరోల ఓవర్ డ్రెస్సింగ్....!



ఆ సీనుకి ఎంతవరకు అవసరమో అంత మేరకు డ్రెస్ చెసుకొంటేనే బాగుంటుంది.విపరీతంగా అనవసరమైన డ్రెస్ maintain చేస్తే తెలుగు ప్రేక్షకులు అది చూసి డంగై పోవాలనా..ఏమిటి?నిన్న ఓ సినిమా చూశాను..దాంట్లో హీరో ఇంట్లో నే మాట్లాడుతుంటాడు.పైన ఒక దళసరి కోటు నీలి రంగులోది వుంటుంది..మళ్ళీ దాని కింద ఒక షర్ట్ రకరకాల గళ్ళది..అంతటితోనే ఆగలా..మళ్ళీ మెడ కింద గుండీలు తీస్తే కనబడే వింధంగా ఇంకో చారల..మరియూ వివిధ రంగుల బనీను వుంటుంది. ఈ విధంగా ఇంట్లో మన A.P. లో ఎంతమంది వుంటారు..!

ఒక్కోసారి పాటల్లో వేసే దుస్తులు కూడా చూసేవాళ్ళకి యమ చిరాకు పుట్టిస్తుంది.అసలు ఆంధ్ర ప్రదేశ్ లో వున్న మాస్ అంతా ఎక్కడో లేదు.టాలీ వుడ్ లోనే వుంది.షోలే లో అమితాబ్ ఎన్ని అందమైన డ్రెస్ లు మార్చాడు..?ఒక చేతి వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.నాకు తెలిసీ ఇప్పటికీ బ్లాక్ షర్ట్..లేత నీలి రంగు పేంట్స్ లాంటివి అందరికీ గుర్తే..! సినిమాలో సరుకు వున్నఫ్ఫుడు డ్రెస్ హంగామా ని ఎవరూ నోళ్ళు వెళ్ళబెట్టి చూడరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి