అసలు ఒక ప్రాంతం అభివృద్ది చెందడం అంటే ఏమిటి..? బోలెడన్ని పరిశ్రమలు వుండటం..నీళ్ళు పొలాలకి పుష్కలంగా వుండటం ఇట్లాంటివేనా..?నేను అనేక ప్రాంతాలు తిరెగే వ్యక్తిగా కొన్ని ఆసక్తికరమైన అంశాలని గమనించాను.ఇవి ఎంతదాకా ఆమోదయోగ్యమోగాని ..నాకు తోచినవి రాస్తున్నాను.అసలు భాషని అలా పెట్టండి..భావాన్ని ఎదుటి మనిషిని ఆకట్టుకొనేలా వ్యక్తం చేయడం ..ఒక మాట ఎదుటి వాడు అన్నా బలాబలాలని అంచన వేసుకొని కొన్నిసార్లు అణిగివుండటం..సమయానుకూలంగా డైరక్టు గానో..ఇంకోలాగానో దెబ్బ తీయడం కోస్తా వారికి వెన్నతో పెట్టిన విద్య.
భాదని గాని..సంతోషాన్ని గాని..ఇంకోదాన్ని గాని వ్యక్తం చేసేటప్పుడు ముఖ్యంగా గోదావరి జిల్లాల వారి మాటల్ని బాగా గమనించండి.ఒక వాక్యం అవసరం అయిన చోట అయిదు వాక్యాలు మాట్లాడతారు.పనిలో పనిగా మనిషిని ఆకాశానికి ఎత్తినట్టు మాట్లాడటం చాలా అలవోకగా చేసేస్తుంటారు.కొన్ని సార్లు అది మనహ్ పూర్తిగా చేసేది కాకపోవచ్చు గాని చాల సహజంగా భావ వ్యక్తీకరణ వుంటుంది.బయటి వారికి అది ఆహా అనిపిస్తుంది.
అసలు భావాన్ని సాధ్యమైనంత hide చేసి ఎదుటి వారితో తమకి అనుకూలంగా పనిచేయించుకొనేలా మాట్లాడటం కూడ అభివృద్ది చెందటలో ఓ భాగం నా దృష్టిలో..!ప్రతి అభివృద్ది చెందిన ప్రాంతంలోనూ మీకు మనుషులు ఇలాగే కనిపిస్తారు.
అభివృద్ది అనేది ముందు మెదడులో ప్రారంభం కావాలి. అక్కడ మధనం జరగాలి.అప్పుడు వనరులు మన దగ్గర లేకపోయినా వున్నచోటికి వెళ్ళి సాధించడం మొదలుబెడతాడు.ఈ లోకంలో ఎవరెన్ని నీతి వాక్యాలు చెప్పినా ఏదీ ఎవరికి వూరికినే ఇవ్వరు.తెలివి పెరిగినవాడు..ఇంకో చోటికి వెళ్ళి గడిస్తాడు.వాడిలో రజోగుణం వూరికినే వుండ నివ్వదు.సోమరితనానికి దూరంగా వుంచుతుంది.ఏదో ఒకటి చెయ్యాలి..ఇంకా సంపాదించాలి అని మనిషిలో తపన మొదలవుతుంది.
అసలు నన్నడిగితే మనిషిలో ఇంకా ఇంకా సంపాదించాలి అని ఎప్పుడైతే తపన పెరుగుతుందో అప్పుడే మనిషిలోని అనేక నూతన ద్వారాలు తెరుచుకొంటుంటాయి.కొత్త ప్రదేశాలు తిరుగుతాడు.ఎక్కడ ఎలా వుండాలో అలా వుంటాడు.అలా అభివృద్దిని సాధిస్తాడు.అది బ్రిటీష్ వాడైనా..లోకల్ వాడైనా సంగతి మాత్రం అదే..! కేరళ లో పరిశ్రమలు చాల తక్కువ...వ్యవసాయ భూమి కూడా తగినంతగా వుండదు.దాని వల్లనే ...లోపల మేధో మధనం జరిగింది కాబట్టే ముంబాయి ఫుట్పాత్ ల దగ్గరుంచి వాళ్ళ వ్యాపారాలు ప్రారంభం అయ్యాయి.మెమన్ లాంటి మాఫియాలూ వాళ్ళే..! రాష్ట్రం కాని రాష్ట్రం లో వారికి ఎలా ఆ తెగువ వచ్చింది...మరదే ముందు లోపల జరగవలసిన అభివృద్ది.ఎక్కడి కోల్కతా..అక్కడ రైల్వెయ్ స్టేషన్ల దగ్గర కూడా వీళ్ళ వ్యాపారాలే..! కాబట్టి మానసిక అభివృద్ది జరిగినప్పుడు ఆటోమేటిగ్గా భౌతికమైన అభివృద్ది జరుగుతుంది..అక్కడ వనరువున్నా...లేకున్నా..!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి