ఈరోజు సంగీత దర్శకులు కి.శే.జె.వి.రాఘవులు గారి గురించి చదివాను.చివరాఖరిలో పేద స్థితిలో మరణించారని..!ఓ చిన్న డాబా లో వుండేవారని.ఒకానొక సమయం లో మంచిగా వెలిగిన మనిషే..!పెద్ద నటుల సినిమాలకే పనిచేశారు.బొబ్బిలి పులి గాని..కటకటాల రుద్రయ్య..ఇలా చాల వాటికి మంచి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన మాటలని బట్టి ఆరోజుల్లో మంచి ఆదాయాన్నే పొందేవారని తెలుస్తోంది.చివరి దశలో ఒక ఆర్దిక సాయం అడిగితే ఒక నిర్మాత చేయలేనని చెప్పినట్లు ఆయన ఇంటర్వ్యూ లో చెప్పారు.
చాలా మంది సినీ కళాకారులు ఇలా చివరిలో దీన స్థితికి చేరుకోవడానికి కారణం ముందు చూపు లేక పోవడమేనా..!రాజన్ -నాగేంద్ర ద్వయం లో ఒకాయన చనిపోయేటప్పుడు కూడ అదే పరిస్థితి.బేంక్ అకౌంట్ లో వంద రూపాలు కూడ లేని పరిస్తితి.మంచి ఉచ్చదశలో మంచి రెమ్యూనరేషన్ తీసుకున్నవారే వీరంతా..!స్వతహాగా కళాకారులకి కొంత వుదార హృదయం వుండటం కూడా దీనికి ఒక కారణమేమో..! అయితే ఇప్పటి జనరేషన్ వాళ్ళు వాళ్ళతో పోలిస్తే ఇలాంటి వాటిల్లో తెలివిగానే వుంటున్నారు.ఏది ఏమైనా చివరిదశలో ఉపయోగపడటానికి ప్రతి మనిషి కొంత వెనక వేసుకోవడం మంచిది.ఇవాళ రేపు ఏ కొడుకులు...కూతుళ్ళు పెట్టే పరిస్థితి కనబడటం లేదు.
ఇక అలాంటప్పుడు వేరే బయటి వాళ్ళు చేయం అంటే వాళ్ళని ఏమని అనగలం..?ఏది ఏమైనా ఎన్నో హృదయాలని తీపి రాగాలతో నింపిన అలాంటి వారు దయనీయకరంగా మరణించడం భాదాకరమే..!!!
cinemavaallu దీపాలు ఉండగానే ఇళ్ళు చక్కపెట్టుకోవాలి.ముద్దొచ్చినప్పుడేనిర్మాతల చంకలెక్కి బాగా వెనకేసుకోవాలి!చివరి కష్టకాలంలో అక్కరకొస్తాయి!పుణ్యకాలం గడిచిపోయాక పిల్లికి బిచ్చం పెట్టరు!ఆఖరి గడియలలో ఎవ్వరూ సహాయ హస్తం అందించరని సినిమా వాళ్ళతో పాటు అందరూ గుర్తుంచుకోవాలి!అనుభవం నేర్పిన పాఠాలను మరవద్దు!
రిప్లయితొలగించండి