Pages

10, జూన్ 2013, సోమవారం

మన ఆర్.టి.సి. బస్సులు వెయ్యి రెట్లు నయం అనిపించిది..!



ఇంతకు ముందు ఓసారి పశ్చిమ బెంగాల్ వెళ్ళినప్పుడు అక్కడి బస్సులు ఎక్కాను.చూద్దాం ఇది ఎలా వుంటుందోనని.. బస్సుల వాలకం గాని...లోపల మైంటినెన్స్ గాని అబ్బే డబ్బారేకుల్లా అనిపించింది. మనం ఎప్పుడో ఎక్కి వుంటాం ఆంధ్రాలో అలాంటి బస్సుల్ని..తీసేసిన scrap లా వున్నాయి.ఒకప్పటి గ్లోరీ వేరు ..ఇప్పటి బెంగాల్ వేరా అనిపించింది...! అంతెందుకు హౌరా స్టేషన్ లో ...రాత్రి పన్నెండు అయ్యింది దిగేటప్పటికి...బయటికి ఒక్కసారే రాగానే ఒక పొగచూరిన వంటగది లోకి వెళ్ళినట్టుగా అనిపించిది.నాకు బజారంతా అంత చికాకుగా...dirty గా అనిపించిది.

జనాలు విపరీతం.ప్రదేశం తక్కువ.ఇక కోల్కత్త అలా కాక ఎలా వుంటుంది.చాలామంది చదువుకున్నవాళ్ళు మంచి జీవితం..సంపాదన కోసం బయటి రాష్ట్రాలు వెళ్ళి పోతుంటారు.అయితే బెంగాలీ వాడికి జనరల్ నాలెడ్జ్  కాస్తా ఎక్కువే నని చెప్పవచ్చు. పుస్తకాలు అవి బాగా చదువుతారు.సీరియెస్ సాహిత్యం బాగా అమ్ముడవుతుంది.మన వాళ్ళలాగా కేవలం ఏ స్వాతి లాంటి సినిమా టిట్ బిట్స్ ..శృంగారం pack చేసిన వీక్లీస్ లాంటివేకాకుండా ఇంగ్లీష్ సాహిత్యం కూడా ..సొంత భాషాలాగానే చదువుతుంటారు.ఇంగ్లీష్ లో కూడా కధలు..వ్యాసాలు గట్ర  మాతృభాషలోలానే రాసిపారేస్తుంటారు.

 ఇక ఒడిషా లో కూడా ప్రభుత్వ బస్సులు మనంత నీట్ గా వుండవు.అప్పుడనిపిస్తుంది..ఎంతైనా తెలుగు వాడి దర్జానే వేరు అని..!తమిళనాడు లో కూడా బస్ స్టాండ్ లు అంత పెద్దవి ఏమీ లేవు..చెన్నై లో కూడా అరకొరగానే వుంటాయి..విజయ వాడ బస్ స్టేషన్ చూస్తే వీళ్ళకి బొమ్మ కనబడుతుంది.బైటికి మాత్రం గొప్ప కబుర్లు చెబుతుంటారు.షోలాపూర్ నుంచి ముంబాయి వెళ్ళాను ఓసారి అక్కడి ప్రభుత్వ బస్సులో..అదీ అంతే ఏడ్చింది.ఏతా వాతా తేలింది ఏమిటంటే చక్కగా బస్సు సర్వీసులు నడపడలో మన ఇది ఎవరికీ రాదని.అలాగని మనలో లోపాలు లేవా అంటే వున్నాయి..చాలానే వున్నాయి..వాళ్ళనుంచి నేర్చుకోవలసినవి చాలానే వున్నాయి.అవి తరవాత మాట్లాడుదాము..ఓ.కే.నా...! 

1 కామెంట్‌:

  1. nijamandi nenu kalkatha vellinappudu bus ekki chusa chekka chairs, benchilu analemo. paatha calender paina print chesina tickets. buvaneswarlo private bus vaallu bediristhe RTC vaadu mammalni ekkinchukokundaa velladu. mee maata nijam mana RTC veyyiretlu manchidi. Radha krishna

    రిప్లయితొలగించండి