Pages

10, జూన్ 2013, సోమవారం

ప్రేమకధా చిత్రం సినిమా పై నా రివ్యూ...!



ఈ రోజే చూశాను ...ఒక మాదిరిగా బాగానే వుంది.ఈ మధ్యనొచ్చే వంశ చరిత్రల డైలాగులు..మనిషి చూడటానికి మూడడుగులున్నా రెచ్చిపోయి డాన్ మాదిరిగా బిల్డప్ లిచ్చే పెడ హైప్ సినిమాల కన్నా ..ఇలాంటి సినిమాలే హాయి అనిపించింది.దీంట్లో సస్పెన్స్ తెలుసుకుని సినిమాకి వెళితే అంత థ్రిల్ వుండదు.కనుక కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతాను.

సినిమాలో ముందు ఆ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గెస్ట్ హౌస్ కి బయలుదేరినప్పుడు..తమిళంలో బాలచందర్ తీసిన వానమే ఎల్లామే అనే సినిమాని కాపీ కొడుతున్నాడా అనిపించింది.అయితే దర్శకుడు  కధని ఇంకో మలుపు తిప్పాడు తెలివిగా..!

చంద్రముఖి సినిమా బాటలోకి కొంత సేపు లాక్కెళ్ళాడు.ఆతరవాత ముని సినిమాలోని ఒక ఉపకధకి చక్కగా కలిపి పారేశాడు.అయితే దర్శకుణ్ణి అభినందించవలసిందే..మొత్తానికి కలిపి సినిమాకి ఒక కొత్త లుక్ ని ఇచ్చాడు.సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా తీసుకెళ్ళారు.

సంగీతం పరవాలేదు.. రీమిక్స్ పాట కాకుండా ఇంకోటి కూడా బాగుంది.మారుతి సూపర్విజన్ కనుక దర్శకుడి పాత్ర ఎంతదాకా వుందో అంచనా వేయలేము.ఏదైనా ఓసారి చూసి ఆనదించవచ్చు.హీరో సుధీర్ బాబు పరవాలేదనిపించాడు.మిగతా ముగ్గురు బాగానే చేశారు నందిత సెలెక్షన్ ఈ సినిమాకి బాగా సరిపోయింది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి