ఇటీవల కొన్ని వికృతవార్తలు అప్పుడప్పుడు చదువుతున్నాము.దీని వెనుక గల వ్యక్తుల మనస్తతత్వాలు ఏమిటి అని ఆరాదీస్తే చాలమటుకు వివాహేతర సంబంధాలే నని తేలుతోంది.ఏదో వార్త వచ్చినప్పుడు చదవడం ..ఆ నేరం చేసిన వ్యక్తిని అసహించుకొని తిట్టుకోవడం ...మర్చిపోయి ఎవరి పనులలో వారు బిజీ అయిపోవడం తప్పా..సంఘటన లోపలకి వెళ్ళి పరిశోధించి దానిని విశ్లేషణ చేసి సాధ్యమైనంత మేరకు దానికి సొల్యూషన్ చూపించడం అన్నది మన సమాజంలో జరగదు...అది పెద్ద లోపం..!
కూతురు మీద అఘాయిత్యం చేసిన కన్నతండ్రి అంటూ పరమ సెంటిమెంటు ఒలకబోస్తూ రాసే పేపర్లు కూడా వాటి లోతుల్లోకి వెళ్ళవు.ఇలాంటి కేసుల్లో చాలా మటుకు ఆ బిడ్డని వేరే ఎవరికో తన భార్య కన్న సంతానంగా ఆ తండ్రి (?) భావించడంగానే వుంటున్నది.ఇంకా చెప్పాలంటే అక్రమసంతానం అనే అనుమానం.కొన్నిసార్లు అది నిజం కూడ కావచ్చు.అయితే ఇవన్నీ లోపలే పెట్టుకొని మరిగిపోవడమే తప్ప బయటికి వెల్లడించి చర్చించుకునే అలవాటు భారతీయ సమాజంలో లేదు.పురుషుణ్ణి కూడా ఇలాంటి సంఘటనలో చిన్నచూపు చూస్తారని బయటి చెప్పుకోడు.అయితే ఒక cold war భార్యాభర్తల మధ్య వుంటుంది.
సంసారంలో వుండే గొడవలు అన్నీ ఒకేలా వుండవు.అన్నిసార్లు పురుషుని వైపు మాత్రమే తప్పు వుండాలని లేదు.కాని మనసమాజంలో స్త్రీకి వెంటనే సమాజమ్నుంచి సానుభూతి లభిస్తుంది.
మీరు ఏ జిల్లా ఎడిషన్ న్ని అయినా తిరగేయండి.భార్య కాపురానికి రావట్లేదనో..వివాహేతర సంబంధం వల్లనో హత్యలు..ఇంకా ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.ధన సంపాదనా దిశగా వెళుతూ చనిపోయేవాళ్ళు చాలా తక్కువ.భార్యాభర్తల నడుమన వచ్చే గొడవలకి సత్వర పరిష్కారం కోర్టుల నుంచి కూడా త్వరగా లభించదు.విడాకుల ఇప్పించడంలో అంత జాప్యం అవసరం లేదు.ఇప్పుడు కాలం మారిది.స్త్రీ కూడా తన కాళ్ళపై నిలబడే దశకి వచ్చింది.వైవాహిక సంబంధాలతో సహా ప్రతి మానవ సంబంధం మనిషి జీవితాన్ని సుఖమయం కావాలి తప్ప గుదిబండగా మారకూడదు.
సంస్కృతి అంటే కొన్ని వందల ..ఏళ్ళనుంచి వచ్చే ప్రతి ఆచారాన్ని పట్టుకొని గుడ్డిగా వేలాడటం కాదు.కాలానుగుణంగా సర్దుబాటు చేసుకోని ఏ సమాజమూ పురోగతి చెందదు..!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి