Pages

16, జూన్ 2013, ఆదివారం

వారానికి ఒక్కరోజు టి.వి. చూడకుండా వుంటే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది...!



నా మాట అబద్దమైతే ప్రయత్నించి చూడండి..! మనసు,శరీరం ఎంత వుల్లాసంగా వుంటాయో తెలుస్తుంది.మన దైనందిన జీవితంలో టి.వి.ఒక భాగమై కూర్చుంది.వార్తలు గాని...సీరియళ్ళు గాని...సినిమాలు గాని..ఇలా సకల కార్యక్రమాలు అలా అతుక్కుని చూసేస్తూనే వుంటాం.దాంట్లో ఏమి మాయ వుందో గాని..మొదట ఓ పావు గంట చూసేసి తరవాత ఏదో పనిచూసుకోవాలనుకుంటాం.అబ్బే..అలా కుదరనివ్వదే..!ఒకదాని కొకటి అలా కొనసాగుతూనే వుంటుంది..ఆ వీక్షణ కార్యక్రమం..!

ఎవ్వరికో ఫోన్ చేయాలనుకుంటాం.. లేదా ఓ పుస్తకమే చదవాలని అనుకుంటాం..లేదా ఏదో రాయాలనుకుంటాం.. ఇవ్వన్నీ కూడా ఈ టి.వి.వీక్షణ వల్లనే కుదరకుండానే పోతుంటాయి.అంతే కాదండోయ్.. ఒక్కసారి విడవకుండా బాగుంది కదాని కొన్ని కార్యక్రమలని గంటలు గంటలు చూస్తుంటాం.దాని వల్ల మనకి తెలియకుండానే dizzy గా అయిపోతుంది మెదడంతా..!చికాకు గా అనిపిస్తుంది..ఇంకా మతిమరపు కూడా వస్తోంది.అది చాల స్పష్టంగా తెలుస్తూనే వుంటుంది.

ఇక ఇలా కాదని..వారానికి ఒకరోజు టి.వి. చూడకూడదని నిర్ణయించుకున్నాను.యేవైనా పగిలి పోయే వార్తలు వున్నా కేవలం రేడియో లో మాత్రమే వినాలని నిశ్చయించుకుని ఈ మధ్య అలా ఫాలో అవుతున్నాను.అబ్బా..ప్రాణానికి ఇప్పుడు ఎంత హాయిగా వున్నదో చెప్పలేను.బృందావన సీమలో విహరిస్తున్నట్టుగా వున్నది మనసుకిప్పుడు.ఇన్నాళ్ళు ఈ సలహా నాకేవరూ చెప్పలేదేమిటి అనుకున్నాను.చెప్పే వుండవచ్చునేమో గాని practical గా చేస్తున్నపుడు కలిగే హాయిని వాళ్ళు సరిగా వివరించలేదేమో..ఒకరిని అనుకోవడం దేనికి ఏదైనా మనది మనకుండాలిగాని..!   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి