నెట్ ఫ్లిక్స్ లో ఈమధ్య చూసిన మళయాళం సినిమా "నాంపకల్ నేరతు మయక్కం" (మధ్యానం నిద్ర లాగా) గురించి రెండు ముక్కలు రాయాలనిపించింది.మమ్మూట్టి ప్రధాన పాత్రధారి. ఎలాంటి అంచనా లేకుండా చూస్తూ పోయాను.చివరకి ఒక గమ్మత్తు అనుభూతి కలిగింది. కథ వింత గా చాలా చిన్నది.దాన్ని డెవెలప్ చేసిన విధానం మటుకు ఆగకుండా చూసేలా చేసింది. ఒకా ముక్కలో చెప్పాలంటే, కేరళ లో నివసించే జేంస్ (మమ్మూట్టి) తన బంధుమిత్రులతో కలిసి తమిళనాడు లోని వెళంకన్ని మాత ని దర్శించుకోవడానికి ఒక మినీ బస్ లో బయలుదేరుతాడు. వచ్చేటప్పుడు ఉన్నట్టుండి ఒక గ్రామం లో దిగిపోతాడు.మిగతా అందరూ నిద్రపోతుంటారు.డ్రైవర్ కూడా లఘు శంక తీర్చుకోవడానికేమోనని అడిగిన వెంటనే బస్ ఆపుతాడు.
ఆ గ్రామం తమిళనాడు లోది.అక్కడి సంస్కృతి అంతా వేరుగా కనబడుతూనే ఉంటుంది. మమ్మూట్టి తనకి ఆ గ్రామం బాగా తెలుసు అన్నట్లు గా గబ గబా ఒక ఇంట్లోకి వెళతాడు.తన వంటి మీది బట్టలు తీసేసి అక్కడ ఆరేసిన బట్టలు వేసుకుంటాడు.ఆవు కి గడ్డి తినడానికి గాను ఒక మోపు ని తెచ్చి వేస్తాడు.ఇంట్లో ఉన్న టివిఎస్ ని ఉపయోగిస్తూంటాడు.తమిళ భాష లో ధారళంగా కలిసిన వారందరి తో మాట్లాడుతుంటాడు.ఇంట్లో వాళ్ళు తమ కుటుంబ సభ్యుడైన సుందరం కేరళ కి వెళ్ళి ఎన్నో రోజులు అయినా తిరిగి రాలేదని దిగుల్లో ఉంటారు. తానే సుందరం అన్నట్లుగా ఈ మమ్ముట్టి ప్రవర్తిస్తుంటాడు. అయితే ఈ గ్రామం లోని వాళ్ళంతా ఇతని మతి చెడిపోయిందని సానుభూతి తో చూస్తుంటారు.
మమ్ముట్టి బంధుమిత్రులు వెతుక్కుంటూ వచ్చి నివ్వెరపోతారు.స్థానికుల సహకారం తో మమ్ముట్టి మధ్యానం పడుకున్నప్పుడు మత్తు ఇంజెక్షన్ వేసి బస్ లో ఎక్కించుకుని పోవాలని ప్లాన్ చేస్తారు. ఇక్కడి తో ఆపుతాను. ఇంకా చెబితే సస్పెన్స్ పోతుంది. వీలైతే తప్పకుండా దీన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడండి. ఈ సినిమా ని చివరి దాకా చూస్తే ఒక మధురమైన కవిత ని చదివిన అనుభూతి కలుగుతుంది.మమ్మూట్టి తాను సూపర్ స్టార్ ని అని కాకుండా ఒక నటుడిని మాత్రమే అన్నట్లుగా ప్రవర్తించడమే చిత్రానికి ఒక నిండుదనాన్ని తెచ్చింది.కొన్ని ప్రతీకలు ఈ సినిమాలో ఆలోచింపజేస్తాయి.వాటిని అర్ధం చేసుకోవడానికి కూడా కొంత జ్ఞానం అవసరం. దర్శకుడు లిజీ జోస్. 2026 లో ఈ సినిమా కి గాను మమ్ముట్టికి కేరళ స్టేట్ ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చింది.
.jpg)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి