Pages

24, అక్టోబర్ 2026, శనివారం

జైలర్-2 సినిమా ఎలా ఉందంటే..?

రజనీ కాంత్ తన వయసు ని దృష్టి లో పెట్టుకొని చాలా మంచి టెక్నిక్ అనుసరిస్తున్నాడు. గతం లో మాదిరి గా ఫైట్లు అవీ చేయడం కష్టం. కనుక ఆ పార్ట్ ల్ని మిగతా హీరోలకి ఇచ్చేశాడు.మోహన్ లాల్,జాకీ ష్రాఫ్,మిథున్,శివ రాజ్ కుమార్, లాంటి ఇతర పెద్ద హీరోల్ని దన్నుగా తెచ్చుకోవడం తో అది తమిళేతర మార్కెట్ ల్ని దున్నేసింది.కథ చెప్పబోవటం లేదు. ఇప్పటికే చాలా మంది చూసి ఉంటారు. హిట్ అయితే మాత్రం రజనీ కాంత్ సినిమా హిట్ అనే టాక్ వస్తుంది. కానీ భలే తెలివి గా ఈ వయసు లో కూడా రజనీ తన ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకోవడం మాత్రం సూపర్. కుటుంబాన్ని విలన్స్ నుంచి కాపాడుకోవడం అనే కాన్సెప్ట్ తో , మంచి ట్విస్ట్ లతో కథ రాసుకోవడం ప్లస్ పాయింట్. 

ఇక్కడ మన తెలుగు స్టార్లు మాత్రం మీసాల పిల్లా అంటూ ఒకరు,గిర గిరా శూలాలు తిప్పుతూ ఇంకొకరు, ముసలితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా  ఇంకా తాము యంగ్ అనే భ్రమ లోనే సినిమాలు తీసిపారేస్తున్నారు. అన్ని భాషల సూపర్ స్టార్లకి తన జైలర్ లో అవకాశం ఇచ్చిన రజనీ మన తెలుగు వాళ్ళకి ఆఫర్ పంపలేదా? ఏమో , అది మనకి తెలియదు. ఏమైనా రజనీ తెలివైన ఫార్మట్ ని ఎన్నుకున్నాడు ప్లస్ వయసు కి తగ్గట్టు తెల్ల వెంట్రుకలతోనూ కనిపిస్తున్నాడు.      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి