Pages

2, నవంబర్ 2014, ఆదివారం

గోవా బీచ్ లో రష్యన్ టూరిస్ట్ ల వెతలు..!



గత ఏడాది లక్ష యాభైవేల మంది రష్యన్ టూరిస్ట్ లు గోవా బీచ్ లకి విచ్చేశారు.ఈ ఏడాది వాళ్ళు వచ్చే సీజన్ మళ్ళీ ఈ సెప్టెంబర్ నుంచి మొదలైంది.ఎందుకో గాని ఈ సారి సీజన్ అచ్చి వచ్చినట్లు లేదు.ఆ నెల లో ఒక రష్యన్ మహిళా టూరిస్ట్ పై దాడి జరగడం,  ఆ తర్వాత హోటల్ లో దిగిన ఓ గ్రూప్ యొక్క వస్తువులు పోవడం,దానికి ఆ హోటల్ వాళ్ళు సహకరించకపోవడం,ఇట్లా చాలా ఘటనలే జరుగుతుండడం తో గోవాలోని రష్యన్ సెంటర్ వారు మాస్కో లోని తమ మీడియా ని ఈ విషయం లో అలెర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నారు.ముఖ్యంగా రష్యన్ లకి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల స్థానికులతోను,అధికారులతోను,చిక్కులు ఎదురౌతున్నాయని తెలుస్తున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి