Pages

8, ఆగస్టు 2014, శుక్రవారం

మురళీమోహన్ అన్న మాటల్లో తప్పు ఏముందో నా మట్టి బుర్రకైతే అర్ధం కాలేదు.



పార్లమెంటు లో మురళీమోహన్ మహిళల అంశం మీద ..ప్రస్తుతం జరుగుతున్న అత్యాచారాల మీద మాట్లాడుతూ అమ్మాయిలు మంచి గా వస్త్ర ధారణ చేసుకోవాలని సూచించడం తప్పు ఎలా అవుతుందో నాకు అర్ధం కాలేదు.మన ఇంట్లో ఉన్న అమ్మాయిలను కూడా ఉద్దేశించి ఏ తల్లి లేదా తండ్రి అయినా ఆ మాట అనడం సహజం..డీసెంట్ గా ఉండాలి డ్రెస్సింగ్ అని చెపుతుంటాం. దానిలో అగౌరవపరిచే విషయం ఏముంది. నాకైతే ఎంత ఆలోచించినా దానిలో పాయింట్ ఏంటో అంతు చిక్కలేదు. దాంట్లో అవమానించడానికి ఏముంది..?

3 కామెంట్‌లు:

  1. Ayyaa...idi randhranveshana edo oka rakamga corner cheyyaali ane mentality.

    రిప్లయితొలగించండి
  2. కరక్ట్ గా చెప్పారు. మురళీమోహన్ గారు అన్నదాంట్లో తప్పేమిటో నాకూ బోధపడటంలేదు. వస్త్రధారణ హుందాగా ఉంటే బాగుంటుందని అంటే మహిళలని కించపరిచినట్లెలా అవుతుంది by any stretch of imagination? నేనేమీ ప్రత్యేకించి మురళీమోహన్ గారి అభిమానిని కాను, వారి నియోజకవర్గానికి చెందినవాడిని కూడా కాను. ఆయన సాధారణంగా వివాదాలకి దూరంగా ఉండే వ్యక్తిలా అనిపిస్తారు. ఇప్పుడు ఆయన మంచి ఉద్దేశ్యంతోనే వ్యాఖ్యానించినా దాన్ని రాజకీయం చేయటానికే వివాదాన్ని సృష్టిస్తున్నారనిపిస్తోంది. ఆయన సినిమాల్లో నటించిన రోజుల్లో ఇవన్నీ గుర్తుకురాలేదా అని వీహెచ్ గారు ఎద్దేవా చేసారు. అలా అయితే రోజాగారి గతం కూడా సినిమాలే కదా. మరి మురళీమోహన్ గారి వ్యాఖ్యని తప్పు పట్టిన రోజా గారు తన సినిమా రోజులు / సినిమా పాత్రలు మర్చిపోయారా? jvrao గారు అన్నట్లు ఇది రంధ్రాన్వేషణే.

    ప్రతిదాంట్లోనూ రాజకీయ లబ్ధి పొందుదామనే ఆలోచన తగ్గించి నిష్పాక్షికంగా చూసే దృష్టి అలవర్చుకుంటే మన రాజకీయాలు కొంతైనా బాగుపడతాయేమో?

    రిప్లయితొలగించండి
  3. అదే మిత్రమా మన ఖర్మం
    మంచి మాట చెప్పేవాడు చవటగా చిత్రీకరించబడుతున్న రోజులివి. . . .
    ఒక్కసారి గమనించు
    రోడ్డుమీద వేగంగా వాహనాన్ని నడుపుతుంటే ఎందుకురా అంతవేగం అంటే
    . . . . వీడికి భయం ఎక్కువరా . ఈ మాత్రం వేగం యువతలో ఉండదా అని
    చదువుకోరా నాన్న మంచి భవిష్యత్‌ ఉంటుంది అంటే
    . . . . మాకు తెలియదా . . నీతులు చెప్పొచ్చాడురా
    అమ్మాకన్నా మంచి బట్టలేసుకోరా అంటే
    . . . . పాత చింతకాయ పచ్చడిలా. . . ఊరిచివరి మారెమ్మ తల్లిలా డెకరేట్‌ చేసుకుంటామా? యూతమ్మా


    అనే రోజులివి. తిరగనీ . . . తిరిగి ఆ(అ)నాగరిక రోజులు రానీ. . . బ. . లేకుండానే తిరిగే రోజులొస్తాయేమోనని భయంగా ఉంది మిత్రమా

    రిప్లయితొలగించండి