Pages

7, ఆగస్టు 2014, గురువారం

కుల వ్యవస్థ పోవాలంటే కొన్ని త్యాగాలు మొదట చేయవలసిందే.



ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే మాట.కుల వ్యవస్థ పోవాలని.నిజమే మన దేశాన్ని వెనక్కి లాగి పడేస్తున్న సమస్యల్లో అది ప్రధానమైనది.పై కులాలవారు ఏమో వీళ్ళ వల్ల మాకు ఉద్యోగాలు రావడం లేదు అని ద్వేషిస్తున్నారు ..నిమ్న కులాల వాళ్ళు ఏమో ఇన్నాళ్ళు మమ్మల్ని అణచివేసినందుకు ఇది మూల్యం అంటారు.మళ్ళీ దీనిలో కూడా అందరికీ అందుతున్నాయా...ఒక క్లాస్ వన్ ఆఫీసర్ కుమారుడు ,ఎక్కడో ఓ మారుమూల పల్లె లో ఉన్న దళితులు పోటీ పడితే ఎవరు గెలుస్తారు ఆ ఉద్యోగవేట లో.అందరం ఊహించవచ్చు.

కాబట్టి రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఒక స్థాయికి వచ్చిన వారందరు తమతోటి సోదరులకు మేలుకలగాలంటే స్వచ్చందంగా ఆ సౌకర్యాన్ని పరిత్యజించాలి.రిజర్వేషన్ ఉపయొగించుకున్నత కాలం తమ కులాన్ని చెప్పుకోవాలసిందే..అలాంటప్పుడు ఈ కులవ్యవస్థ ఎలా పోతుంది.ఎప్పుడైతే జనరల్ కులాల తో పోటి పడతారో అప్పుడే పై వర్ణాలవారు కూడా తప్పనిసరిగా గౌరవమిస్తారు.

అటువంటి కాలం లని కూడా ప్రతి గవర్నమెంట్ కి సంబందించిన అప్లికేషన్ లలో పొందుపరచాలి.దూరదృష్టి లో  ఆలోచించి కులవ్యవస్థ ని అంతమొందించవలసిన తరుణం వచ్చింది.   
  

3 కామెంట్‌లు:

  1. నిజమా! మరి పెళ్ళిసంబంధాలగురించేమిటటా? ఎవరికివారు కులపరిమితులకు లోబడే బంధుత్వాలనూ, స్నేహాలనూ కొనసాగిస్తూ ఉద్యోగాల విషయంలోమాత్రం కులవ్యవస్థ (అంటే రిజర్వేషన్లు అని అర్ధం) పోవాలని కోరుకోవడం ఏమాత్రం సమంజసం?

    రిజర్వేషన్లు అనేవి ఇంకో (కుల)వ్యవస్థ. అందులోని మంచిచెడులు కేవలం అందులోనివారు మాత్రమే ఆలోచించుకోవాలి.

    నేను కులవ్యవస్త్యాధారితమైన భారతీయ సంస్కృతినీ, రిజర్వేషన్ సంస్కృతినీ ఒకే తీవ్రతతో ఖండిస్తాను.

    రిప్లయితొలగించండి

  2. మీ సజెషన్ బాగానేఉంది.కాని అలా ఉన్నసౌకర్యం దాన్ని అనుభవిస్తున్నవాళ్ళు వదలుకొంటారా అనేది సందేహమే.అదీగాక అందరికీ విద్య,ఇల్లు.కనీస సౌకర్యాలు కల్పించగలిగే వరకు రిజర్వేషన్లు కొనసాగించ వలసి వస్తుందనుకొంటాను.అంతేగాని కులవ్యవస్థకు వ్యతిరెకంగా ఉపన్యాసాలు ఎన్ని ఇచ్చినా లాభంలేదు.

    రిప్లయితొలగించండి
  3. chudadndi kula vyavaastha nirmulanaki okate margam,varnanthara vivahalu chesukovadam,mee pillalakaina ma pillalakaina varnanthara vivahalu cheddam apudu andariki reservation vasthadi

    రిప్లయితొలగించండి