Pages

15, డిసెంబర్ 2015, మంగళవారం

"కాల్ మనీ" ఉదంతం లో ఎవరి పాత్ర ఎంతెంత..



 అసలు ఇంత సిగ్గుమాలిన ,డబ్బు కోసం అశుద్దం తినడానికి వెనుకాడని ఇంత నీతి మాలిన వ్యాపారాలు సాగించాలనే ఆలోచన వచ్చిన ఆ బుర్రల్లో ఎంత ఆసిడ్ పోసి కాల్చినా తప్పు లేదు.తెల్లారి లేస్తే తెలుగు సంస్కృతి..ఆ సంస్కృతి అంటూ బోడి కబుర్లు చెప్పే పేపర్లు కూడా అవలంబిస్తున్న పాత్ర చూస్తుంటే అసలు ప్రజలు అధికారం ఇచ్చింది ఏ పార్టీ కైనా ఆ పార్టీ కి చెందిన పెట్టుబడిదారులు దోచుకోవాడానికేనా..అదీ ఇంత నీచాతి నీచమైన బిజినెస్ తో.

మన దేశం లో ముఖ్యంగా రాష్ట్రం లో బాగా భర్ష్టు పట్టి పోయిన పదం ఏదైనా ఉందా అంటే అది ప్రజా స్వామ్యం.ఆ పేరు మీద ఇక్కడ నడిచేది ఫక్తు కుల పాలన.కుల అహంకార పాలన.ఓటు వేసిన వారిలో అనేక కులాలు వారు ఉంటారు.అది మర్చి పోకూడదు.మన ప్రజలూ అంతే.ఎంత వెధవ పాలన అయినా గమ్మున భరిస్తారు.చైతన్యం నిండిన పాశ్చాత్య  దేశాల్లోని ప్రజాస్వామ్యాల్లో గద్దెనెక్కిన వాళ్ళు ధన దోపిడికి దిగితే ఉమ్మడిగా కలిసి ప్రజలంతా  రక్తపు టేరులు పారిస్తారు. ఫ్రెంచ్ విప్లవం అలా వచ్చిందే.అక్కడ ప్రభు వర్గాన్ని చంపి పాతర వేశారు.అలాంటి చైతన్యం ఉన్న చోట ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది తప్ప బానిస బతుకులకి అలవాటు పడిన జనాలున్న చోట కాదు.

కాబట్టి సాగినంత కాలం ఇలా అడ్డమైన దారుల్లో దోచుకుంటూనే ఉంటారు.అసలు ఏ మాత్రం ఆధ్యాత్మిక యోచన కాని అలాంటి క్రమశిక్షణ కాని లేకుండా కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యం గా పెట్టుకునే జాతులు పై పై మెరుగులతో నాగరికత సాధించుకున్నట్లు గప్పాలు కొట్టుకున్నా రాష్ట్రం దాటితే వారి జ్ఞానాన్ని చూసి అంతా ఇకిలిస్తుంటారు.ఎలాగైనా సంపాదించు..ఎవరినైనా తార్చు..వెనకేసుకో.ఆ తర్వాత తొడ కొట్టుకో..చీప్ సినిమాలు తీసుకో ..అవే తెలుగు దనం గా మురిసిపో..అయ్యా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది.కొన్నాళ్ళు వార్తలు వస్తాయి..అస్మదీయులు చక్రం తిప్పుతారు.మళ్ళీ అంతా మామూలే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి