Pages

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

రాం చరణ్ అనే కాదు ఎన్.టి.ఆర్.,మహేష్ బాబు,అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళు తెలుగు సినిమాల్లో తమ పెద్దలకున్న దన్ను తో నెగ్గుకు రావడమే తప్ప బయటికి పోతే ఎవరూ దేకరు.

ఉన్నపరువుని కాస్తా పొగొట్టుకోవడం అంటే ఇదే..! రాం చరణ్ హిందీ లో జంజీర్ రీమేక్ చేసి హిందీ లో ఉన్న పరువుని వూడగొట్టుకున్నాడు.ప్రాంతీయ చిత్రాల్లో చేసుకుని హిట్లు ఇస్తుంటే...అవతలనున్నవాళ్ళు కూడా అబ్బో ఇతను గాని హిందీలోకి వస్తేనా అన్న లెవెల్లో కొంచెం బిల్డప్పు లిచ్చుకోవచ్చు. అలనాటి అమితాబ్ సినిమాని రీమేక్ చేయడం పెద్ద సాహసం..కాదు దుస్సాహసం.


జంజీర్ హిందీ సినిమాకి వచ్చిన రివ్యూ లు చాలా ఘోరంగా వున్నాయి. రాం చరణ్ మొహం లో రెండు ఎక్స్ ప్రెషన్స్ తప్ప మరింకేమీ పలకలేదని రాశాయి.కొంతమంది ముందుకెళ్ళి సంజయ్ దత్ తో అతను చేసే ఫైట్ హనుమంతుడితో ఎలక పిల్ల తలపడినట్లుగా వుందని రాశాయి.

రాం చరణ్ అనే కాదు ఎన్.టి.ఆర్.,మహేష్ బాబు,అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళు తెలుగు సినిమాల్లో తమ పెద్దలకున్న దన్ను తో నెగ్గుకు రావడమే తప్ప బయటికి పోతే ఎవరూ దేకరు.దానికి వుదాహరణే రాం చరణ్ తాజా ఉదంతం.    Click here 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి