Pages

27, జూన్ 2018, బుధవారం

రమణానంద మహర్షి కధ ఏమిటి..?



ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్ లో రమణానంద మహర్షి ఫోటోలు చూసి ఆశ్చర్య పోవడం జరిగింది.ఏదో దేశం లో బీచ్ లో పడక మంచం లాటి దాని పైన ఓ ఫోజు తో,షార్ట్స్ లో ఓ ఫోజు తో ఇలా యమా ఆధునిక రీతి లో దిగిన ఫోటోలు నివ్వెర పోయేట్లు చేశాయి.సరే..అవి వేసుకోవద్దని ఎవరూ అనట్లేదు గాని..విభూతి బోట్లు పెట్టుకొని కాషాయం కట్టుకొని ..శక్తి పాతం ఇస్తా అదీ ఇదీ అంటూ మీటింగ్ లు గట్రా పెట్టి బ్రాంచ్ ల వారీ గా వసూళ్ళు చేస్తూ తరించే ఈ మనిషి ఉన్నట్లుండి ఇలా దర్శనం ఇవ్వడం కొద్ది గా షాక్ పుట్టించింది.ఈ మహానుభావుడి ప్రసంగాన్ని ఓ సారి అనుకోకుండా విని ఇక మీదట ఎప్పుడూ ఈ యన గారి మీటింగ్ కి ఎంతమాత్రం రాకూడదని అనుకున్నాను.

అసలు మహర్షి అనే పదాన్ని పేరు లో పెట్టుకోడానికి ఎంత ధైర్యం..?రమణ మహర్షి లాంటి వారే తనని తాను మహర్షి అని ఎప్పుడూ చెప్పుకోలేదు.ఆ తర్వాత ఆయన శిష్యులు అలా పిలిచారు.అది స్థిరపడిపోయింది.ఈ నయా మహర్షి ప్రసంగం వింటే అనిపించింది ఏమిటంటే యోగం గురించి గాని,ఆధ్యాత్మిక విషయాల గురించి గాని ఈయనకి తెలిసింది శూన్యం.అయితే వాచాలత ఎక్కువ.వెనకది ముందుకి ముందుది వెనక్కి చెప్పి మాటల గారడి చేస్తుంటాడు.పైగా శక్తి పాతం ఇవ్వడం అంత తేలికా..?మరీ వెర్రివాళ్ళను చేయడం కాకపోతే..!జనానికి ఇలాంటి అంశాల మీద పెద్దగా అవగాహన లేకపోవడం తో ఇలాంటి ఆషాఢభూతులు ఆడింది ఆటగా సాగిపోతోంది.

నిజంగా యోగసాధన లో పురోగమించిన వారి ధరణి యే వేరు గా ఉంటుంది.సంస్కృతమే మాటాడనవసరం లేదు.సామాన్యమైన మాటల్లో చెప్పినా దాని పరిమళాలు గుండెల్లో తాకుతాయి.ఈ రమణానంద కి విపరీతమైన వాగాడంబరమే తప్పా తెలుగు కూడా వంకర టింకర గా మాటాడుతుంటాడు.చదువు వల్ల వచ్చే సంస్కారం గాని సాధన వల్ల వచ్చే సంస్కారం గాని ఈ వ్యక్తి లో మచ్చుకి కనిపించవు.కాని ఇంత బిజినెస్ ఎలా అభివృద్ధి చేశాడో భక్తి పేరు తో...మార్కెటింగ్ టెక్నిక్స్ బాగానే ఉన్నాయి ఈ లెక్కన..!

2 కామెంట్‌లు:

  1. విశ్వామిత్రు డంతటి వాడు బ్రహ్మర్షి అనిపించుకోవటం కోసం చేసిన తపస్సు నభూతో నభవిష్యతి. కాని కలికాలంలో ఎవరికి వారు భ్రహ్మర్షుల మని బిరుదు పెట్టుకొంటే నవ్వుకోవటం తప్ప చేయగలిగింధి ఏమీ లేదు.

    రిప్లయితొలగించండి
  2. ఇటువంటి వారిని ఆంగ్లంలో charlatan అంటారు. ప్రజలు మూర్ఖుల్లాగా ఉన్నంతకాలం ఇటువంటి స్వాములకు పండగే.

    రిప్లయితొలగించండి