Pages

19, ఆగస్టు 2018, ఆదివారం

తెలంగాణా ప్రభుత్వం 25 కోట్లు విరాళం గా ప్రకటించడం కొంత అతి గానే ఉంది.

కేరళ లో వచ్చిన వరదలు భీబత్సమైనవే.కాదనడం లేదు.కాని తెలంగాణా ప్రభుత్వం 25 కోట్లు విరాళం గా ప్రకటించడం కొంత అతి గానే ఉంది.దేశం లోనే వాణిజ్య రాజధాని గా పేరుబడి ఉన్న ముంబాయి ని కలిగి ఉన్న మహారాష్ట్ర యే 20 కోట్లు విరాళం ప్రకటించింది.అలాగే ఢిల్లీ మరో సూపర్ వాణిజ్య కేంద్రం ..వాళ్ళూ 10 కోట్లు ప్రకటించారు.మిగతావాళ్ళు 10,5,2 కోట్ల చొప్పున ప్రకటిస్తూ పోయారు.ఇలాంటి అప్పుడు సాధ్యమైనంత దాకా కేంద్రమే దెబ్బ తిన్న రాష్ట్రాన్ని ఆదుకుంటుంది.అది సహజంగా జరగాలి. 

గతం లో అంటే 1999 లో ఒరిస్సా లో తుఫాను ఇంకా వరదల భీబత్సానికి దాదాపు 30 వేల మంది దాకా చనిపోయారు.దివిసీమ లో వరదలప్పుడూ దాదాపు గా ఆ సంఖ్య కి మించే చనిపోయారు.అయితే అధికారికంగా వేలల్లోనే చావులు జరిగాయి.అలాంటప్పుడు గాని ,ఆ తర్వాత వచ్చిన వరదలప్పుడు గాని (ఏ రాష్ట్రం లో గాని) కేరళ రాష్ట్రం ఎప్పుడూ లక్షల్లో నే తప్ప కోట్ల లో ఎప్పుడూ విరాళం ఎవరికీ ఇచ్చినట్లు గుర్తు లేదు.

మన తాహతు చూసుకునే దానాలు ఇవ్వాలి తప్పా ఏదో గొప్పలు కోసం ఇవ్వకూడదు.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి.ఇంకా అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉన్నాయి.అవన్నీ ఎవరి నెత్తిన చివరకి పడేది..అది ఆలోచించాలి. 

2 కామెంట్‌లు:

  1. హుద్ హుద్ తుఫాను వచ్చినపుడు తెలంగాణా పేద రాష్ట్రం. ఇపుడు దేశంలోనే ధనిక రాష్ట్రం. ప్రజలకు సేవ చేయడానికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నపుడు ఇటువంటి సాయం చేయడం వారికి రాజకీయ పరంగా మంచి అవకాశం.

    రిప్లయితొలగించండి
  2. తామే మొదటిస్థానంలో ఉండాలనుకున్న వారు అందరికన్న పెచ్చుగా ఇచ్చారు. పోనీయండి అదీ మంచిదేగా. ఎన్నడూ కేరళరాష్ట్రం ఇతరరాష్ట్రాలకు విపత్సమయాల్లో ఆట్టే సాయం చేయలేదంటారా. అదీ పోనియండి. ఇప్పుడన్నా ఆ గుణం అవసరాన్ని గుర్తిస్తారని ఆశించుదాం. మీరన్నట్లు తనకుమాలిన ధర్మం అన్నమాట నిజమే ఐనా అత్యవసరసమయాల్లో అలా ఆలోచించకూడదని అనుకుందాం. అలా బాగుంటుంది.

    రిప్లయితొలగించండి