Pages

23, మార్చి 2017, గురువారం

వీళ్ళ దోపిడికి అంతు అనేది లేదా..?


బ్యాంక్ లు ఇటీవల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కస్టమర్ల ని నిలువు దోపిడి చేస్తున్నట్లుగా అర్ధమవుతుంది.కనీస మొత్తం లేకపోతే బాదుడు,రెండు లక్షలు పైన వ్యవహారం చేస్తే బాదుడు,ATM ల లో మూడు సార్లు వారానికి మించి తీస్తే బాదుడు,ఇలా ప్రతి దానికి బాదుతూ జనాల్ని చికాకు చేస్తూన్నాయి.చాలా ప్రముఖ బ్యాంక్ ల ATM లు పేరు కే తప్ప ఎప్పుడు డబ్బు డ్రా చేద్దామని వెళ్ళినా పని చేయవు.అప్పుడు కస్టమర్ ఎన్యో నిరాశ కి లోనవుతాడు.చాలా అర్జంట్ పనులు కూడా ఆగిపోతుంటాఇ.మరి అలాంటప్పుడు మనం అంతా కలిసి ఒక డిమాండ్ ఎందుకు చేయకూడదు.మూడు సార్లు ATM లు ఈ విధన్ గా ఫేలయితే దానికి తగిన నగదు మూల్యం వడ్డీ రూపం లో కస్టమర్ కి ఇవ్వాలి లేదా మరో రకంగా పూరించాలి.

కోటీశ్వరుల  రుణాలను ఎంతో ఉదారంగా వదిలేస్తూ ..దానికి రకరకాల ముద్దు పేర్లు పెట్టి ..ఆ భారాన్ని సామాన్య జనాల మీద తొయ్యడం ఎంత మాత్రం భావ్యం కాదు.ప్రజలంతా అన్ని రకాల భేషజాల్ని వదిలి బ్యాంక్ ల దోపిడి మీద పోరాడవలసిన అవసరం ఈరోజు ఏర్పడింది.

5, మార్చి 2017, ఆదివారం

"ఘాజీ" సినిమా రివ్యూ



ఒక చక్కని విలక్షణమైన సినిమా.సినిమా లో ఎక్కడా పాటలు లేవు.పిచ్చి హాస్యం లేదు.ఒకటే.పాకిస్తానీ సబ్ మరైన్ ఘాజీ ని వెంటాడి ఫినిష్ చూపించారు సినిమా లో.కాని ఎక్కడా బోరు లేదు.ఒక కొత్త దనం చూపించాడు.ఇంత దాకా మిలిటరీ అంటే ఆర్మీ అన్నట్లు గా చూపించారు.కాని సముద్ర గర్భం లో సాగే యుద్ధం ని ఈసారి చూయించారు.అందుకు అభినందించవలసిందే.దానిలో సాగే డ్రామా..అదీ మరీ బోరు కొట్టదు.అప్పుడప్పుడు ఇలాంటి వాటిని కూడా జనాలు ఆదరించాలి లేదా  పిల్లి బిత్తిరి మాస్ సినిమాలే తప్ప ఇంకొకటి తెలుగు వాళ్ళకి తెలియవు అని ఇండియా అంతా అనుకునే అవకాశం ఉంది.సంకల్ప్ రెడ్డి మూడు భాషల్లో  తీయడం మంచిది అయింది.సినిమా మొత్తానికి దర్శకుని ప్రతిభ కి అభినందించవలసిందె.కె.కె.మీనన్,రాణా ఇంకా అంతా అలరించారు.

సముద్రం లోపల ఇలాంటి ఓ ప్రపంచం ఉంటుంది..అక్కడ ఇలాంటివి జరుగుతాయి అని మొదటి సారి గా మాస్ వర్గాలు కూడా తెలుసుకున్నారు అని చెప్పాలి. మొరటు సినిమాలే కాక ఇలాంటి సినిమాలు తీస్తుంటే తెలుగు ప్రజల తెలివి కూడా ఇతరులకి తెలుస్తుంది.

6, ఫిబ్రవరి 2017, సోమవారం

ఏమిటో ఈ వంశ గా ధలు..ఎవడు నమ్ముతాడని వీళ్ళ పిచ్చి గాని...


ఈ మధ్య బ్లాగు ల్లో తగ్గింది గాని  ఫేస్ బుక్ లో మరీ రెచ్చిపోయి విజృంభణ చేస్తున్నారు.అదే ..చారిత్రక పురుషుల్ని ఇంకా ఆయా వంశ చరిత్రల్ని తమ కులం పాలు చేసుకోడానికి చేసే ప్రయత్నాలు.ఇటీవల ఒకాయన శ్రీకృస్ణ దేయరాయలు ని తమ కులానికి కలపాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు,ఆ ఆధారాలు ఈ ఆధారాలు అని.అవి నిజంగా పరిశీలిస్తే సరిగా కనిపించి చావవు ..ఒకటైతే  కనిపించినా ఏ కులానికి చెందినట్లు ఎక్కడా ఉండవు. అది వారికీ తెలుసు.కాని ఘనత వహించిన తమ కులం దానికి చెందాలనేది ఈ యన పట్టుదల లా ఉందే అనిపిస్తుంది.అసలు ఇప్పుడు ఉన్నంత సాలిడ్ గా కులం గతం లో లేదు.అవసరాన్ని బట్టి రాజులు బలవంతులతో అన్ని రకాల సర్దుబాట్లు చేసుకునేవారు.ఎవరకి అంకితే వారిదే రాజ్యం ఆ రోజున.సూర్య చంద్ర వంశాలు కి కలుపుతూ రాయమని చెబితే రాసే పండితులు ఎందరో ఆ రోజున. గతం లో కాకతీయులకి కలుపుతూ భజనలు వాయించుకున్న వీరు ప్రస్తుతం రాయలు కి కలుపుకుంటున్నారు.


మళ్ళీ పైగా పరిశోధనలు చట్టుబండలు అంటూ ఏవో ఉదహరిస్తుంటారు.అసలు ఈ ప్రజాస్వామ్య యుగం లో ఇంకా కులం పేరు తో గొప్పలు పోవడం,దానికి సొల్లు ఉదాహరణలు చూపుతూ రాసుకోవడం అది వారి పైత్యానికి నిదర్శనం.పైగా ఈ రాసే వాళ్ళంతా చదువుకొని ఉద్యోగాలు వెలగబెట్టినవాళ్ళే.మహమ్మదీయులు లేదా ఇతర విదేశీయులు ఇతర దేశాల నుంచి  వచ్చి ఇక్కడ భూముల్ని ఆక్రమించి రాజ్యాల్ని ఆక్రమించినప్పుడు ఘనత  వహించిన ఈ కులాల వాళ్ళందరూ వారి మోచేతి నీళ్ళు తాగి జీవించిన వాళ్ళే.కాని వీరి గొప్పదనం ఎందుకు పనికి వస్తుంది అంటే సాటి హిందూ మతం లోని బడుగు కులాల దగ్గర చూపించడానికి పనికి వస్తుంది.చరిత్ర చదివితే తెలిసే సత్యాలు ఇవి.అందుకే కొంత మందికి చరిత్ర అంటే ఇష్టం ఉండదు. 

26, జనవరి 2017, గురువారం

శతమానం భవతి సినిమా రివ్యూ



ఇప్పటికే ఈ సినిమా టాక్ బయటకి వచ్చేసింది.నేను చూడటం కొంచెం లేటయింది.స్టోరీ ని తెర మీద పెద్ద లెంగ్తీ డైలాగులు కాని బరువు అయిన సన్నివేశాలు గాని లేకుండా అవసరం అయినంత మేరకు  మాత్రమే అందం గా పరిచి తీశారు.నీట్ గా అనిపించింది బోరు కొట్టకుండా..!ఫోటోగ్రఫీ సగం ప్రాణం అని చెప్పాలి.విన్నూత్నం గా ఆలోచించే దిశ గా సినిమా వెళ్ళింది.ప్రకాష్ రాజ్ కి జయ సుధ కి చాన్నాళ్ళకి గుర్తుండి పోయే పాత్రలు దొరికాయి.శర్వానంద్,అనుపమ పరమేశ్వరన్ లు ఓ.కె.దీనిలో అలనాటి నరేష్ కి ఒక మంచి కేరక్టర్ పడింది..మతిమరుపు,మెరుపు వేగం గల మనిషి గా అలరించి మంచి మార్కులు కొట్టేశాడు.

సంగీతం ఫరవాలేదు.ఇతర నటీ నటులు సరిపోయారు. మారుతున్న ప్రపంచీకరణ రోజుల్లో ఉండవలసిన బంధాలు గురించి ఒక నూతన ఆవిష్కరణ చేశారు.ఏ పిల్లలు తమ తల్లి దండ్రుల్ని కావాలని మరిచిపోరు,దానికి దోహదం కావించే జీవిత అనుభవాల వల్లనే అలా మారుతారు.ఈ మారుతున్న రోజుల్ని బట్టి పెద్దలు కూడా తమ ముందు రోజుల కోసం ప్లాన్ చేసుకోవాలి.సందేశం ఉన్నప్పటికీ వినోదం ని మిస్ అవకుండా తీయడం వల్ల రెండు పెద్ద హీరోల సినిమాల నడుమ రిలీజ్ అయినప్పటికి  తన ప్రత్యేకత ని నిలుపుకోగలిగింది ఈ చిత్రం.

22, జనవరి 2017, ఆదివారం

చాగంటి చేసిందా తప్పు కాదా..?

ముమ్మాటికీ తప్పే...ఆయన ఉపాన్యాసాలు ఎంతగానోప్రజలకి ఉపయోగపడవచ్చు గాక..ఎంతో సేవలు నోటి ద్వారా చేయవచ్చు గాక..అవి కొంత మాందిని కదిలించవచ్చు గాక్క..కాని ప్రస్తుతం మనం జీవిస్తున్నది ప్రజాస్వామ్య దేశం లో..అది మర్చి పోకూడదు.ఎవరైనా..ఎపుడైనా..! మనం రాసుకున్న  రాజ్యాంగం ప్రకారం ఎలాంటి విచక్షణ కులాల ప్రకారం చూపడానికి  వీలు లేదు.అది అంతే..ఇష్టం ఉన్నా లేకున్నా..! మన దేశం ఒక విచిత్ర దేశం.రూలు రూలే..అది అదే..అంటే ఎవరిష్టం వారిదే..అదేంటో పెద్ద సీరియస్ గా కోర్టులు గూడా తీసుకోవు,తల కడిగితే మొల కడగరు అనే మాట ఎప్పుడో ఉండవచ్చును కాని ఇప్పుడు ఉటంకించుట తగదు...అంత దాకా ఎందుకు ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి... ఆయన కమ్మూనిటిని కించపరుస్తూ...కాని అవన్నీ ఎప్పుడైనా చెప్పారా ..?ఇప్పుడు అందరకీ చదువు ఉంది.అందరు సకల శాస్త్రాలు చదువుతున్నారు.ఎప్పుడో చెప్పినా కథలన్నీ ఇప్పుడు చెప్పీ నమ్మమంటే ఎవరూ తయరూ గా ఉండరు.అది గుర్తు పెట్టుకోవడం మంచిది.

ఎంతో హావ భావ ప్రకటనల తో ,ఒకటికి పది మాటలు చెబుతూ జనాల చెవులో పూవులు పెడదామంటే ఇపుడు కుదరదు.రోజులు మారాయి,అది గమనించి ఎవరి పని వారు చేసు కోవడం మంచిది.అయినా సెంట్రల్ గవర్న్మెంట్ ఉద్యోగి గా ఉన్న ఈయన బయటకి వచ్చి ఇలాంటి తల లేని మొల లేని ఉపాన్యాసాలు చేయాడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా..?

ఇంకా ఒకటి చెప్పదలుచుకున్నా.. ఇలాంటి ఓ ఉపన్యాసాన్ని తమిళనాడు కి వెళ్ళి ఇవ్వండి చూద్దాం..అక్కడి బ్రాహ్మణులే ఖండించుతారు..అది వారి కే తెలుసును..!

8, జనవరి 2017, ఆదివారం

బాలకృష్ణ , చిరంజీవి సినిమాల పబ్లిసిటీ స్టంట్లు


ఓ వైపు ఖైదీ నం.150 ఇంకో వైపు గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రెండు సినిమాలు అతి త్వరలో రీలీజ్ కాబోతున్నాయి.ఈ నేపధ్యం లో రేగుతున్న వేడి, అభిమానుల ఆవేషకావేషాలు చూస్తుంటే ఈ అజ్ఞానపు దురద ఎప్పటికి పోతుందో అర్ధం కావట్లేదు.ఇంతకీ వచ్చీ అవి ఏమన్నా జాతీయ అంతర్జాతీయ స్థాయి లో పేరు తెచ్చే సినిమాలా అంటే ఒకటి ఏమో తమిళం నుంచి రీమేక్ కాగా ఇంకోటి ఏమో ఆధారాలు రవ్వంత ఉంటే నానా కధలు దానికి దట్టించి అదే గొప్ప స్టోరీ అన్నట్లు విపరీతమైన డబ్బా.చరిత్ర ని గౌరవించి సాధ్యమైనంత దగ్గరగా తీయాలి కాస్ట్యూం లు అయితేనేం..ఇంకోటి అయితేనేం.! కాని కిలోల కొద్దీ గోల్డ్ వంటి  మీద దిగవేసుకొని ,ఆ ఆహార్యం చూస్తుంటే చరిత్ర తెలిసిన వారికి చికాకు పుడుతుంది. ఇప్పటి దాకా బయలుపడిన    ఏ ప్రాచీన  శిల్పాల్లొనూ అలాంటి ఆహార్యం కనబడదు.ఎవరు ఫేన్సీ కి వాళ్ళు తీస్తున్నప్పుడు తెలుగు చరిత్ర అని చెప్పుకోడము ఎందుకు..?

అమ్మడు..కుమ్ముడు అనుకుంటూ పాటలతో మరొక సినిమా సిద్దమవుతున్నది.ఈ మధ్య వచ్చిన దంగల్ సినిమా చూడండి.ఆ విధంగా హృదయాన్ని కరిగిస్తూనే సందేశం ఇవ్వగల సినిమాలు మన తెలుగు స్టార్స్ వాళ్ళ బ్రతుకుల్లో తీయగలరా..?చీప్ టెక్నిక్స్ తో కులాల్ని ,రాజకీయాల్ని వాడుకుంటూ చలామణీ అయ్యే వీళ్ళు రాష్ట్రం దాటితే ప్రతి వాళ్ళూ వీళ్ళని  పరిహాసం చేసే వాళ్ళే.వీళ్ళ అజ్ఞానానికి నవ్వుకునే వాళ్ళే.  

29, డిసెంబర్ 2016, గురువారం

ఇది ఒక అరుదైన సంఘటన..కానీ పట్టించుకున్న వారేరి...!!


ఈ నెల 27 వ తారీఖున పేపర్ న్యూస్ ప్రకారం  తెలంగాణా రాష్ట్రం లోని పెద్ద పల్లి ఇంకా మంచిర్యాల పరిసరాల్లో ఒక మంచి ఘటన జరిగింది.ఆ ముందు రోజు ఆయా ప్రాంతాల్లోని మతి స్థిమితం లేకుండా బజార్ల లో తిరిగే అభాగ్యుల్ని  అందర్నీ తీసుకొచ్చి వాళ్ళకి తైల సంస్కారం చేయించి,స్నానాలు చేయించి,నూతన వస్త్రాలు ధరింప జేసి ఒక హోం కి పంపించడం అనేది ఒక గొప్ప విషయం,అందునా పోలీసు అధికారులు ఈ పనికి పూనుకోవడం అభినందించదగ్గ అంశం.మనం ప్రతి రోజు ఇలాంటి వాళ్ళని,జంతు ప్రాయంగా జీవిస్తున్న మానవుల్ని చూసి వెళ్ళిపోతుంటాము,ఏమి చేయాలో తెలియక,ఎవరికి చెప్పాలో తెలియక.

ఎన్.జీ.వో. లు ఎంతోకొంత చేస్తున్నా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.ఈ సత్కార్యాన్ని ప్రారంభించిన రామగుండం పోలీస్ కమీషనర్ విక్రంజిత్ దుగ్గల్ గారిని మనసారా అభినందించాలి,ఎప్పుడూ సొల్లు రాజకీయాలే కాకుండా ఇలాంటి ఘటనలు జరిగినపుడు కవరేజీ ఇవ్వడం మీడియా ప్రతిష్టని కూడా పెంచుతుంది.