నాగార్జున హీరోగా వచ్చిన అతి చెత్త సినిమాల్లో ఇది ఒకటి.డాన్ లేదా భాయ్ అనగానే style గా ఉండే డ్రెస్ లు,పక్కన అమ్మాయిలు,పవర్ ఫుల్ డైలాగులు,ఎక్స్ ట్ర..ఎక్స్ ట్ర.ఇదీ ఈ రోజుల్లో కూడా మన దర్శక నిర్మాతల అవగాహన.ప్రతి విషయానికి ఇప్పుడు బోలెడంత exposure వచ్చింది..చదవండి..అర్ధం చేసుకొండి..ఆలోచించండి...ఇంకా రొడ్డకొట్టుడు ధోరణిలో సినిమాలు తీస్తూవుంటే ఆ వంశానికి..ఈ వంశానికి చెందిన హీరోలు అనుకుంటూ ఆబగా ఎగబడి జనాలు సినిమాలు చూసే రోజులు పోయాయి. డబ్బింగ్ తమిళ్ సినిమాల్లో ఉండే నావెల్టి కూడా మన తెలుగు సినిమాలు కలిగిఉండటం లేదు.
అసలు మాఫియా ...మాఫియా అని సినిమాల్లో ఉచ్చరించే వీళ్ళలో ఎంతమంది గాడ్ ఫాదర్ నవలా చదివారు.మనసు పెట్టి చదివితే తప్పకుండా ఒక రాం గోపాల్ వర్మ అవుతాడు ప్రతి దర్శకుడు.అంటే దానర్ధం మనిషి పొరల్లోని ప్రతి ఎమోషన్ ని ఎటువంటి రాగద్వేషాలు లేకుండా వివేచించుకోవడం ప్రారంభమవుతుంది. విచిత్రం ఏమిటంటే మన తెలుగు దర్శకులు గాని..ప్రముఖ హీరోలు గాని...ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు తప్ప ఇంగ్లీష్ నవలలు,థ్రిల్లర్స్ చదవరు..అసలు చదవడం అంటేనే వీళ్ళకి తేళ్ళు జెర్రులు పాకినట్టు ఉంటుంది.ఆ సంస్కృతి ఎక్కడ ఉందని.
తమిళ్,మళయాళ,హిందీ హీరోలు, దర్శకులలో మంచి సృజనకారులుగా పేరిన్నిక గన్నవారంత చక్కటి చదువరులు..ముఖ్యంగా లేటెస్ట్ ఇంగ్లీష్ ఫిక్షన్ బాగ చదువుతారు.ఆ ఫ్లేవర్ కనబడుతుంది.అది చూసి మన వాళ్ళు బండ గా ఇమిటేట్ చేస్తారు..దాంట్లో రా నెస్ తప్ప ఫ్రెష్నెస్ ఉండదు.
అలాంటి వాటిల్లో ఈ భాయ్ కూడా ఒకటి.రిచా గంగోపాధ్యయ స్థానం లో అంతకన్న ఎవరూ చేయగలిగేది ఏమీ లేదు.మొదటి సగం హీరో ని అప్ చేయడం లో సరిపోతుంది.. రెండో సగం లో సెంటిమెంట్తో రుద్దడం జరిగింది.కొన్ని పాటలు.కొంత మసాల.అదీ సంగతీ..ఎంత తక్కువ చెబితే అంత మంచిది. Click here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి