Pages

8, జనవరి 2017, ఆదివారం

బాలకృష్ణ , చిరంజీవి సినిమాల పబ్లిసిటీ స్టంట్లు


ఓ వైపు ఖైదీ నం.150 ఇంకో వైపు గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రెండు సినిమాలు అతి త్వరలో రీలీజ్ కాబోతున్నాయి.ఈ నేపధ్యం లో రేగుతున్న వేడి, అభిమానుల ఆవేషకావేషాలు చూస్తుంటే ఈ అజ్ఞానపు దురద ఎప్పటికి పోతుందో అర్ధం కావట్లేదు.ఇంతకీ వచ్చీ అవి ఏమన్నా జాతీయ అంతర్జాతీయ స్థాయి లో పేరు తెచ్చే సినిమాలా అంటే ఒకటి ఏమో తమిళం నుంచి రీమేక్ కాగా ఇంకోటి ఏమో ఆధారాలు రవ్వంత ఉంటే నానా కధలు దానికి దట్టించి అదే గొప్ప స్టోరీ అన్నట్లు విపరీతమైన డబ్బా.చరిత్ర ని గౌరవించి సాధ్యమైనంత దగ్గరగా తీయాలి కాస్ట్యూం లు అయితేనేం..ఇంకోటి అయితేనేం.! కాని కిలోల కొద్దీ గోల్డ్ వంటి  మీద దిగవేసుకొని ,ఆ ఆహార్యం చూస్తుంటే చరిత్ర తెలిసిన వారికి చికాకు పుడుతుంది. ఇప్పటి దాకా బయలుపడిన    ఏ ప్రాచీన  శిల్పాల్లొనూ అలాంటి ఆహార్యం కనబడదు.ఎవరు ఫేన్సీ కి వాళ్ళు తీస్తున్నప్పుడు తెలుగు చరిత్ర అని చెప్పుకోడము ఎందుకు..?

అమ్మడు..కుమ్ముడు అనుకుంటూ పాటలతో మరొక సినిమా సిద్దమవుతున్నది.ఈ మధ్య వచ్చిన దంగల్ సినిమా చూడండి.ఆ విధంగా హృదయాన్ని కరిగిస్తూనే సందేశం ఇవ్వగల సినిమాలు మన తెలుగు స్టార్స్ వాళ్ళ బ్రతుకుల్లో తీయగలరా..?చీప్ టెక్నిక్స్ తో కులాల్ని ,రాజకీయాల్ని వాడుకుంటూ చలామణీ అయ్యే వీళ్ళు రాష్ట్రం దాటితే ప్రతి వాళ్ళూ వీళ్ళని  పరిహాసం చేసే వాళ్ళే.వీళ్ళ అజ్ఞానానికి నవ్వుకునే వాళ్ళే.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి