Pages

17, నవంబర్ 2014, సోమవారం

"ఎర్ర బస్సు" సినిమా పై నా రివ్యూ..!



దాసరి నారాయణ రావు కి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి.గతం లో మామా గారు లో కూడ అమాయకుడైన వ్యక్తిగా బాగా మెప్పించాడు.అమాయకుడైన పల్లెటూరి వ్యక్తిలా కనిపించడానికి దాసరి ఎన్నుకున్న దారి కొద్దిగా ఓవర్ అనిపించింది.నగరం లో ఉండేవాళ్ళతా కర్కశులుగాను,పల్లె లో ఉండేవాళ్ళంతా పరోపకారులు గాను ఈ రోజున ఎవరూ అనుకునే పరిస్థితి లేదు.నగరం లో పల్లెని ,పల్లెదనం లోని గొప్ప గుణాల్ని ప్రేమించేవారు ఎందరో ఉన్నారు.అయినా పాలకొల్లు అంత వెనకబడిన ప్రాంతమా..కంప్యూటర్ కి,శాండ్విచ్ తయారు చేసే దానికి తేడా తెలియదా..? 

నిజానికి పల్లెపట్టులే చాలా తెలివైనవి.ఎదుటి వారిని బురిడి కొట్టించడం లో గాని,రాజకీయ వ్యూహాలు చేయడం లో గాని.బాగా గ్రామం లో ఉండే స్టడీ చేసిన వారికి తెలుస్తుంది అది...!అయితే మన సినిమా ల్లో తీస్తే అంతా వన్ సైడెడ్ గా తీస్తారు.ఆ లెక్కన చూసుకుంటే రాష్ట్ర ముఖ్య మంత్రులందరు కేవలం హైద్రాబాద్ లో పుట్టిన వారే కావాలిగదా.మన నగరాల్లో కనిపించే (అండర్ కరెంట్గా) అలవాట్లు చాలామటుకు వాటి మూలాలు పల్లెల్లోనే ఉన్నాయి.

నగరం లో ఉన్నంత సేపు పైపై న చూస్తే పల్లె గూర్చి ఏమీ తెలీదు.కాకపోతే కొన్ని సోఫిస్టికేటెడ్ పదాలు వారికి తెలియకపోవచ్చు.కాని మనిషిని చదవటం లోను,డబ్బు చేసుకోవడం లోను,కర్కశంగా వ్యవహరించడం లోను ఎవరికీ తక్కువగారు.ప్రాక్టికల్ గా లేని...ఇలాంటి ఊహాజనిత సినిమాలు ప్రేక్షకులని ఇంకా అజ్ఞానం లో ఉంచుతాయి.

ఇది ఒక తాతామనవళ్ళ మధ్య జరిగే సెంటిమెంట్ కధ.తాతా అతి మంచి.మనవడు అతి ప్రేమి.హీరోయిన్ ఒక నలకలా వస్తుంది.హీరోయిన్ అటు సెక్సీ గానూ లేదు.ఇటు నటన పరం గాను లేదు.ఏదో ఉంది అంతే.చక్రి సంగీతం లో రెండు పాటలు బాగున్నాయి.నటన పరంగా దాసరి మార్కులు కొట్టేస్తాడు.దానిలో సందేహం లేదు.విష్ణు కూడా నీట్ గా చేశాడు.సెంట్మెంట్ కూడ వర్కవుట్ అయితే సినిమా ఆడవచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి