ఈ మధ్య మా క్లాస్ మేట్ ఒకతను శుభలేఖ ఇచ్చాడు.వ్యవసాయకుటుంబానికి చెందినవాడు.ఆర్దికంగా ఏ లోటు లేనివాడే.చూడగానే అడిగాను..ఏమిటి ఎంత కట్నం అదీ..అని.ఎందుకంటార అవి ఆ కుటుంబాల్లో బాగా ఉంటాయని నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి.దానికి అతను ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది.
మేమే ఆడపిల్లవాళ్ళకి పన్నెండు లక్షలు ఎదురిచ్చి చేసుకుంటున్నాము అని చెప్పాడు.ఏమిటది ..అలాగా..అని అడిగితే ,మా కుటుంబాల్లో ఆడపిల్లలు బాగా తగ్గి పోయారు.దొరకడమే చాలా కష్టంగా మారింది.ఒక వేళ ఉన్నా చదువుకున్న ఆడపిల్లలు వ్యవసాయదారుల్ని చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.అందుకే మేమే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది.అంతే కాదు మాలో బాగా కలిగినవాళ్ళు కూడా ఆడపిల్లల్ని కనడానికి ఆసక్తి చూపించనందువల్ల చివరకి మేము ఒక్కోసారి ఇతర కులాల ఆడపిల్లల్ని కూడా చేసుకోవలసిన పరిస్థితి వస్తున్నదని చెప్పుకొచ్చాడు.మొత్తానికి ఎవరి బాధలు వారివి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి