Pages

7, జనవరి 2015, బుధవారం

తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక,రాజకీయ అంశాలపై పై ఇంగ్లీష్ లో రాయబడే బ్లాగులు ఏమైనా ఉంటే తెలుపగలరు



మన తెలుగు ను మనం ఎంత ప్రేమించుకున్న మన భాష తెలియని ఇతర రాష్ట్రాల వారికి మన సంగతులు తెలియాలంటే ఏ ఇంగ్లీష్ లోనో రాయకతప్పదు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సంగతుల్ని వివరించే ఇంగ్లీష్ బ్లాగులు అదీ తెలుగు వారు రాసేవి ఏవైనా ఉంటే తెలుపగలరా..?మన తెలుగు బ్లాగులు ఆ విషయం లో బాగానే కృషి చేస్తున్నాయి గాని పేరెన్నిక గన్న ఇంగ్లీష్ బ్లాగులు ఎన్న్ ఉండి ఉంటాయో...ప్రత్యేకించి ఏ తెలంగాణా వాదాన్నో ఇంకో వాదాన్నో సమర్దించేవి గాకుండా సమతూకం లో విషయ నిర్ధారణ చేసి  జరుగుతున్న విశేషాలు వివరించే బ్లాగుల గురించి నేను అడుగుతున్నాను.దీనివల్ల ఇతరులకి కూడా మన రాష్ట్రాల గురించి ఫోకస్ పెరుగుతుంది. ద వీక్ లాంటి ఇంగ్లీష్ పత్రికల్ని చూస్తుంటానా...ఎప్పుడైనా కోనసీమ అందాల గురించో ఇంకో చెప్పుకోదగ్గ అంశం గురించో రాస్తారేమో అని చూస్తుంటాను.అదేమీ లేదు ఎంతసేపు నెగిటివ్ అంశాలు,అత్తెసరు వార్తల కవరేజీలే ఇస్తుంటారు.విచిత్రం ఏమిటంటే లలితా అయ్యర్ అనిచెప్పి ఓ కరస్పాండెంట్  మన తెలుగు రాష్ట్రాల వార్ర్తల్ని హైద్రాబాద్ నుంచి కవర్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.తెలుగు మనుషులెవరూ ఇంగ్లీష్ వార్తల్ని ఇక్కణ్ణుంచి కవర్ చేయడానికి దొరకరా.ఏ కలకత్తా నో,చెన్నై నో చూస్తే ..అక్కణ్ణుంచి కవర్ చేసే వాళ్ళు బెంగాళీ,తమిళ పేర్లే ఉంటాయి వాళ్ళకి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి