Pages

11, జనవరి 2015, ఆదివారం

మాటాడితే మనోభావాలు దెబ్బతిన్నాయంటారు..!అంత సున్నితమా అవి..!



మన దేశం లో మనో భావాలు దెబ్బ తినడం బాగా ప్రారంభమయిందీమధ్య.అసలీ పదం ఏమిటో దాని అర్ధం ఏమిటో ఎవరూ సరిగా వివరించరు.ఒకటి మాత్రం నిజం..మనకెవరి మీదనైన ఇష్టం లేకపోతే ఏ కేసో వేయడానికి ఇది బాగా పనికొస్తుంది.ఒక్కోసారి దాడులు కూడ ఈ పేరు పై జరపవచ్చును.అప్పుడు ఓ సమూహం మద్ధతు కూడా దొరుకును.మిగతా సమూహాలకు అసహ్యం కూడా పుట్టవచ్చును.కాని డోంట్ కేర్.

ఇంత సున్నితమైన వీరి మనసులు అదేమిటో రోడ్ల పక్క నుండే మల వసర్జనలు చూస్తే స్పందించవు.ఏమిటీ చండాలం..ఎన్నాళ్ళీ తోటి మానవుల్ని వేధించే అలవాట్లని అనుకోరు.ట్రాఫిక్ జాం లు,ముందే జరుగుతున్న అత్యాచారాలు ఇలాంటి వి ఏవి మన మనోభావాల్ని దెబ్బతీయలేవు.అంత దాకా ఎందుకు కొంత మంది సినిమా హిట్ కాడానికి కూడా ఈ మనోభావాల ఆటని ఉపయోగించుకుంటారని కొన్ని వర్గాల భొగట్టా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి