Pages

14, జనవరి 2015, బుధవారం

"గోపాలా గోపాలా" సినిమా పై నా రివ్యూ..!



ఈ సినిమా తెలుగు లోకి రాకముందు హిందీ లో OMG అనే పేరుతో తీశారు.దానిలో పరేష్ రావల్,అక్షయ్ కుమార్ నటించిన సంగతి విదితమే.నిజానికి ఇది ఒక గుజరాతి డ్రామా ..సినిమా గా మలిచారు.తెలుగు సినిమా ని చాలా వరకు హిందీ సినిమాకి దగ్గరగా నే తీశారు.సేఫ్టి గదా..!

గోపాల రావు బిజినెస్ మేన్.దేవుని విగ్రహాలు అమ్మే నాస్తికుడు.అతని బిల్డింగ్ కూలిపోవడం,ఇన్సూరెన్స్ వాళ్ళు అది దేవుని చర్య గాబట్టి మేము దానికి క్లైం ఇవ్వం అంటారు.ఇక హీరో దేవుని మీద కేసు వేయడం ..తన డబ్బుల్ని దేవుని ప్రతినిధులు గా చెప్పుకునే సాధువులు,బాబాలు ఇంకా ఇతర మత పెద్దలు ఇవ్వాలని కోర్ట్ లో వాదిస్తాడు.చూడటానికి పైపైన లాజిక్ ఉన్నా అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ని సినిమా క్రియేటర్స్ సరిగా అర్ధం చేసుకోలేదు అనిపిస్తుంది.అయితే ఆ పేరుతో కొన్ని మూఢ నమ్మకాల్ని ప్రశ్నించడం జరిగింది.

దేవుణ్ణి నమ్మన వాడిని కూడా ఎలా బాబా గా చేస్తారో ..ప్రచారాలు ఎలా చేస్తారో..ఆ బిజినెస్ ఎలా నడుస్తుందో అదంతా మిథున్ చక్రబొర్తి అండ్ కో రూపం లో బాగా చూపించారు.అది జనాల్ని అలరిస్తుంది.ఉన్నంతలో ఎంతో కొంత ఒక ఆలోచించదగ్గ సినిమా తీసినందుకు అభినందించవలసిందే.

మరీ సూపర్ హీరోయిజం, తొడగొట్టడాలు టైప్ సినిమాలు చూసి చూసి ఒక ఆహ్లాదం చేకూర్చింది.పవన్ కళ్యాణ్ ,వెంకటేష్ లు పాత్రల పరిధుల మేరకు బాగా చేశారు.శ్రేయ కూడా ఓ.కె.,అయితే ఇదివర లోనున్నంత గ్లామర్ లేదు.అనూప్ రూబెన్స్ సంగీతం ఫరవాలేదు.ఫోటోగ్రఫీ బావుంది.దర్శకుడు బోర్ కొట్టకుండా నడిపించాడు.పోసాని బాగా నవ్వించాడు.మిథున్ కూడా ఓ.కె.,అయితే అతడిని అటు ఇటు కాని వాడిగా ఎందుకు చూపించడం లోని ఆంతర్యం ఏమిటో..సరే..ఒకసారి చూడవచ్చు.నష్టం లేదు టికెట్ డబ్బులకి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి