ఈనాటి తరం వారికి గణేశ్ పాత్రో అంటే కేవలం SVSC మాటల రచయిత గానే తెలుసు.కాని పాత్రో మాటల రచయిత గా,కధకునిగా చాలా ప్రత్యేకమైన ముద్ర తెలుగు సినిమా పై వేసినవాడు.మూస పద్ధతిలో కాకుండా ఒక సామాన్యుడు,అసామాన్యుడు ఒకే రీతిలో ఎంజాయ్ చేయగలిగే విధంగా ఆయన రాశేవాడు.అందుకనే ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ లాంటివాడు తెలుగు లో ఎప్పుడు సినిమా తీసినా గణేశ్ పాత్రో ని తప్పకుండా తన టీం లో ఉంచుకునేవాడు.
ఒక్క మరో చరిత్ర చాలు అతని భావప్రకటన లోని వైదుష్యానికి. ఇది కధ కాదు,గుప్పెడు మనసు, ఇంకా ఇలాంటి చక్కని సినిమాలు ఎన్నెన్నో..!తప్పకుండా పాత్రో ఒక ప్రత్యేక మేధావి గా మన్నన్లు అందుకున్నాడు.ఆయన ఆత్మ కి శాంతి కలుగు గాక...!ఎంత వారికైనా మరణం తప్పదు గదా..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి