Pages

1, అక్టోబర్ 2023, ఆదివారం

ఆయన అరెస్ట్ అయిన తర్వాత బాల కృష్ణ గారి ధోరణి సినిమా మూస లోనే .....

 అప్పుడప్పుడు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. చంద్రబాబు జైలు కెళతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే అలా అనిపించడం సహజం. న్యాయ వ్యవస్థ లో తిరుగులేని పట్టు కలిగి ఇదిగో ఈ విషయం లో దొరికిపోతాడు అనుకునేలోపు దాంట్లోచి బయటకి రాగలగడం మనం అనేకసార్లు చూడలేదా..? స్వతహగా ఎన్ టీ ఆర్ లాగా గొప్ప స్పీచ్ లు అవీ ఇచ్చే చరిష్మా లేకపోయినా తన మనుషుల్ని ఎక్కడ ప్లాంట్ చేయాలో అక్కడ ప్లాంట్ చేసి కార్యాల్ని గంధర్వుల మాదిరి గా మూడో కంటికి తెలియకుండా నడిపించడం బాబు గారి చతురత కి నిదర్శనం.

ఆయన అరెస్ట్ అయిన తర్వాత బాల కృష్ణ గారి ధోరణి సినిమా మూస లోనే తప్పా మారకపోవడం చిత్రం. మమ్మల్ని ఏమీ పీకలేవు అంటూ బూతులు అందుకోవడం అసెంబ్లీ లో అలాంటి చేతి సైగలు చేయడం ఆయన రాజకీయ అపరిపక్వత కి నిదర్శనం. ఆల్ రెడీ అక్కడ పీకి చూపించాడు ప్రత్యర్థి ...అయినా ఏం పీకుతావు అంటూ మాట్లాడటం ఏమిటో అర్థం కావట్లేదు. ఇక పవన్ పయనం ఏమిటో గందరగోళం గా ఉంది.

రాజకీయ క్షేత్రం లో పవర్ ఎప్పుడూ ఒకే వైపు ఎల్లకాలం ఉండదు. గతం లో జగన్ ని అరెస్ట్ చేయడం , అతని కుటుంబాన్ని వేధించడం కళ్ళున్న ప్రతి ఒక్కరు చూశారు. ప్రస్తుతం జరిగింది దానికి టిట్ ఫర్ టాట్ లాంటిది తప్పా మరొకటి కాదన్నట్లు సామాన్యుడు భావిస్తున్నాడు. అందుకనే పవర్ చేతి లో ఉన్నప్పుడు ఎదుటి పక్షాన్ని ఒక స్థాయి దాటి వేధించరు నిజం గా తెలివైనవాళ్ళు. ఎందుకంటే పవర్ చేతులు మారినపుడు పదింతలై వెనక్కి తిరిగి వస్తుంది. తల్చుకుంటే సోనియమ్మ ని,రాహుల్ బాబు ని జైల్లో పెట్టించలేరా మోడీ షాలు...కానీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు పవర్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదని.      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి