సెల్వ రాఘవన్ గతం లో కొన్ని మంచి హిట్ సినిమాలు తీశాడు ..సరే అవి మనాళ్ళు కూడా రీమేక్ చేసుకుని హిట్ లు కొట్టడం జరిగింది.ఆడవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే లాంటి వన్నమాట.ఒక సినిమా హిట్ అయింది గదాని సేం టు సేం అలాంటి స్టీరియొ టైప్ సినిమాలే మళ్ళీ తీయకపోవడం తమిల్ దర్శకుల గొప్పదనం అని చెప్పాలి.మళ్ళీ ఈసారి రాఘవ ఎవరికీ అంతు బట్టని ఓ మిస్టీరియెస్ కధని ఎంచుకున్నాడు. అతను ఎంచుకున్న కధలో అనేక అంశాల్ని గూఢంగా సింబాలిక్ గా చెప్పాలనుకున్నాడు.ఆ పాళ్ళు కాస్తా ఎక్కువై ప్రేక్షకుడిని టార్చర్ పేడతాడు.
రెండు లోకాల్లో ఓ ప్రేమ కధ జరగడం అనేది.. మనిషి లోపలి లోకాల్లో జరిగే జరిగే మధనం గా అనుకున్నా ..దానిలోకి ఏవేవో అనవసరమైన పిట్టకధలు జోడించడం తో కలగాపులగ మైంది.ఇంగ్లీష్ లో కొన్ని ఇలాంటి abstract భావాలతో కూడిన చిత్రాలు వచ్చాయి.అయితే మనదగ్గర వాటిని అందుకునే మానసిక పరిపక్వత తక్కువ.అనుష్క,ఆర్య వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు.
సంగీతం ఏవరేజ్ గా వుంది.డబ్బింగ్ చేయడం లో కూడా కొంత క్లారిటి పోయి వుంటుంది.కొన్ని లింక్ లు పోతే ఇలాంటివి చాలా pale గా ఉంటాయి.ఆ మద్య రజనీకాంత్ ఓ సినిమాలో ఓ రకమైన డ్రెస్ ఒక మంచి పాటలో వేసుకున్నాడని...ఆ తర్వాత వచ్చిన మన తెలుగు హీరో సినిమాలో కూడా సేం అలాంటి డ్రెస్ నే వేసి...అదే టైప్ లో పాట తీసేసుకున్నాడు.మళ్ళీ దర్శకుడి గా కూడా ఆడబ్బింగ్ దర్శకుడే సుమా...ఇలాంటి గొర్రెల లాంటి హీరోల నటనల కంటే వైరైటి జోడించే ఫెయిల్ అయిన ఇలాంటివే బెస్ట్. CLICK HERE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి