Pages

12, జులై 2014, శనివారం

స్విస్ బ్యాంకుల్లో డబ్బులన్నీ ఏమయినబ్బా..!



ఈ మధ్య పేపర్ల లో చదివారా...అసలు తమ దేశం లో భారతీయుల ఖాతాలేమీనట్టు స్విస్ ప్రభుత్వం ప్రకటించిందట.మరి ఇన్ని రోజులనుంచి నానా ప్రకటనలు ..నల్లధనం గురించి వచ్చినవన్నీ హుళక్కేనా..?భారతీయులంత ఓపికమంతులు ఎక్కడా ఉండరన్న విష్యం వాళ్ళకి బాగా తెలుసనుకుంటా..! ఎన్నో వాట్లి గూర్చి ఎడతెగని ఉద్యమాలు చేస్తుంటారు మన సోకాల్డ్ నిజాయితీ గల పార్టీలు..స్వచ్చంద సంస్థలు..వగైరాలు.కాని నల్లధనం విషయం లో అలాంటి మొక్కవోని పోరాటాలు ఎందుకో చేయరో..?

 ఇండియాని లోతుగా స్టడీ చేస్తే ఒకటి బాగా అర్ధం అవుతుంది...ఏమిటంటే అవినీతి భారీ స్థాయిలో చేయగలిగితే వారికి ఎలాంటి ఢోకా ఉండదు.కాని చేత కానట్లు ఏ వందకో..వెయ్యి కో ..లక్ష కో కక్కుర్తి పడితే మాత్రం వారి ని ప్రపంచ స్థాయి అవినీతిపరులుగా మన పత్రికలు చిత్రీకరిస్తాయి.స్టింగ్ ఆపరేషన్లు లాంటివి చేసి వాళ్ళ ఫోటోలని సినిమా స్టార్లుగా ముద్రించుతారు.మన జనాలు కూడా అంతకి తగ్గ బొంతలే.మన కులం వాడయితే చాలు..వాడి అవినీతి మన కంటికి కడు ఇంపుగా కనిపిస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి