రెండు ముక్కలయ్యింది రాష్ట్రం.ఎవడి దోవ వాడు చూసుకొని అక్కడ శ్రద్ధ పెట్టుకొని డెవలప్ చేసుకొంటే పోతుంది గదా...ఇక్కడ హైదరాబాద్ లో పే చేసే ఏ పన్ను ఆంధ్ర కి లాభించే అవకాశమే లేదు.అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి పనులు వేగవంతం చేసుకోవడం గదా చేయవలసింది.అది గాలికి వదిలి ఇంకా గబ్బిలం లా ఎందుకు పట్టుకొని వేలాడటం.ఆంధ్రా లో చెట్ల కింద ఆఫీసులు పెట్టాలని పైకి చెప్పుకోవడం కవిత్వానికి బాగుంటుంది తప్ప నిజం లేదు.కావలసినన్ని బిల్డింగ్ లున్నాయి మనసు పెట్టి చూస్తే.ఒకే సారి వంద అంతస్తుల భవనాలు తయారయితే తప్ప ఇక్కడినుంచి కదలరా..?
గవర్నర్ పాలన లో హైద్రాబాద్ ఉంచాలని చూడటం ..ఆ పిచ్చి రాజకీయాలు మాని సాధ్యమైనంత త్వరగా అక్కడకి పాలన తరలి వెళ్ళాలనేదే సగటు ఆంధ్రుని కోరిక.అయితే పట్టి ఆపుతున్నదేమిటి...ఇన్నాళ్ళు కొన్ని తిమింగళాలు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకున్న వందల,వేల ఎకరాల భూముల్ని విడిచి రాలేకనేగా ఈ సోది ఇంకా..!గవర్నర్ పాలన అదీ..ఇదీ..అంటూ ..మొత్తం హోల్ దేశానికి ఇప్పుడు సీను కళ్ళకి కట్టినట్టు అర్ధం అవుతున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి