Pages

4, జులై 2014, శుక్రవారం

మందు బాబుల్ని మరీ తీసిపారేయకండి..వాళ్ళ సమస్యల్ని వినాలి..!



రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన ఆదాయం పొందేది మద్యం అమ్మకాల నుంచే.వాటిని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నారు.అది కాదనలేని సత్యం.మద్య నిషేధం చెప్పుకోవడానికి బాగుంటుంది గాని ఎక్కడా సక్సెస్ కాదు..కాలేదు..కాబోదు.ఎందుకంటే అది మానవ చరిత్ర కి అందని రోజుల నుంచి మనిషికి ఉన్న అలవాటు.కాకపోతే కొంత మంది బాహాటంగా చేస్తే..ఇంకొంతమంది గుట్టుచప్పుడు కాకుండా లాగిస్తారు.ఈ రోజు పేపర్ల లో చదివాను. ఏదో బార్ కోడింగ్ రాబోతున్నదని.ఉన్న ధరల కంటే ఎక్కువ అమ్మడం..కల్తీ బాటిళ్ళు రావడం దీని వెనుక పెద్ద చరిత్ర ఉంటుంది.ఎక్సైజ్ వాళ్ళకి,పోలీసు వాళ్ళకి ఇంకా ఇతర ముఖ్యమైన శాఖ ల వారికి మద్యం షాపుల వాళ్ళు ముడుపులు ప్రతి నెల చెల్లించుకొంటూ ఉంటారు.దాని వల్ల ఆ మందానికి మందు బాబుల్ని వీళ్ళు రక రకాలుగా దోచుకొంటూ ఉంటారు.వాటిని అరికడితే ఆటోమేటిగ్గా అన్ని తగ్గుతాయి.అదేంటో గాని చాలా విదేశాల  ధరలతో చూసినా మన దేశం లో మందు విపరీతమైన ఖరీది.కొన్ని యూరోపియన్ దేశాల్లో బీరు బాటిల్ ధర 5 డాలర్ల లోపు లోనే ఉంటుంది.రూపాయల్లో మార్చుకొని మనం కళ్ళు తేలేస్తాం గాని అక్కడ వాళ్ళకది 5 రూపాయల్లాంటిదే వారి సంపాదనతో పోలిస్తే.మళ్ళీ మన నాణ్యత కూడా దిగదుడుపే. మనల్ని పాలించే వాళ్ళ బామ్మర్దులే మందు కాంట్రక్టర్లు అయినప్పుడు ఇంకెలా ఏడుస్తుంది..?   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి