Pages

27, సెప్టెంబర్ 2014, శనివారం

"ఆగడు" సినిమా పై నా రివ్యూ......!



ఈ రోజే చూశాను.సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఒకటే డైలాగుల రొద.అవి ఎంత దాకా జనానికి అర్ధం అవుతున్నాయి అనేది అసలేమాత్రం పట్టించుకోలేదు.డబ్బాలో రాళ్ళు వేసి ఊపినట్లుగా ఉన్నాయి.పంచ్ డైలాగులా నా మొఖం డైలాగులా..ఏదైనా ఒక సందర్భాన్ని బట్టి పేల్చితేనే అవి పేల్తాయి తప్పా ఓ రణగొణ లా వాగితే ఈ సినిమా లానే ఉంటుంది.కదలో టోటల్ గా పట్టుంది గాని మరీ ఓవర్ యాక్షన్ వల్ల డ్రామా లా అనిపించింది సినిమా.తమన్నా లో ఇదివరకున్న గ్లామర్ లేదు.మహేష్ కూడా అంతే.పాటలు ఒకటి రెండు వినబడతాయి.మిగతావి చూడటం మటుకే.కొత్తదనం చూపెట్టడం లో పూర్తిగా నిరాశపరిచింది.తమన్ బేక్ గ్రౌండ్ స్కోరింగ్ కొంత ఫరవాలేదు.రెండు మూడు సినిమాలు మిక్స్ చేసి కధ వండారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి