Pages

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పబ్లిక్ రోడ్లని తమ బాబు సొమ్ములా వాడుకుంటున్నారు.



ఈ మధ్య చూస్తున్నాను..ఒక్కోసారి బండి వేసుకొని వెళుతుంటామా రోడ్డుకి అడ్డంగా ఒక వాల్ మాదిరిగా షామియానాలు,తెరలు కట్టేసి కొంతమంది జనాలు తమ సొంత కార్యక్రమాలు జరుపుకొంటున్నారు.పెళ్ళి కావచ్చు,మీటింగ్లు కావచ్చు,భోజనాలు కావచ్చు అన్నీ ఆ రొడ్డుకడ్డంగానే.ఇంకా కొంతమంది ముందుకెళ్ళి అసలెవరూ ఇటు పోకూడదన్నట్లు రోడ్డుకి అడ్డంగా బారికేడ్లు కట్టిపడేస్తున్నారు.కనీసం వచ్చీ పోయే పబ్లిక్ కి ఆటంకం ఏర్పాటు తుందనే కామన్ సెన్స్ కూడా లేకుండా పోతున్నది.ఏవైనా కార్యక్రమాలు ఉంటే ఏవైనా హాలులోనో,కనీసం ఏ ఇతర కట్టడం లోపలనో అద్దె చెల్లించి జరుపుకోవాలి.అంత స్థోమత లేకపోతే మానెయ్యాలి.కానీ ప్రభుత్వం జనాలందరి సదుపాయం కొరకు వేసిన రోడ్లని ఆక్రమించి దానిమీద అడ్డంగా కార్యక్రమాల్ని జరిపే అధికారం ఎవరిచ్చారు.ఎవరైనా ప్రశ్నిస్తే కాసేపు ఆగలేవా అంటారు.ఇలాంటి వాటి మీద ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ ఉక్కుపాదం మోపాలి. 

1 కామెంట్‌:

  1. నిజమే. కాని, మన సమాజంలో, ఎంతటి నైరాశ్యం అనాలో లేకపోతే జడ్డితనం అనాలో, ఇలాంటి విషయాల్లో చాలా మందికి తప్పేమీ కనిపించదు. అందుకని సద్దుకుపోవాలి అని ప్రవచిస్తూ ఉంటారు. ఏమిచేస్తాం, సద్దుకుపోవాలి అంతే. చెయ్యగలిగినది ఏమీ లేదు, మనకు బి పి అల్సరు రావటం తప్ప.

    రిప్లయితొలగించండి