Pages

10, అక్టోబర్ 2014, శుక్రవారం

చిట్ ఫండ్ స్కాం లో అరెస్టైన మహిళా ప్రొడ్యూసర్



ఈ రోజు CBI అర్థ తత్వ చిట్ ఫండ్ స్కాం కి సంబందించి ముంబాయి కి చెందిన మోడల్ ఇంకా  టివీ సీరియళ్ళ ప్రొడ్యూసర్ అయిన ప్రీతి భాటియా ని అరెస్ట్ చేసినట్లు వార్త వచ్చింది.ఎలాంటి అనుమతి లేకుండా ఆమె భాగస్వామి గా ఉన్న ఓ టి.వి.& సినిమా కంపెనీ లోకి అర్థ తత్వ చిట్ ఫండ్ కంపెనీ ధనాన్ని తరలించిందని ఆరోపణలు మూలంగా ఈ అరెస్ట్ లు జరిగాయి.CBI ఎప్పటినుంచో ఈ కేసుని పరిశోధిస్తూ ఒక్కొక్కళ్ళనే అరెస్ట్చేస్తూ వస్తున్నది.ఇటీవల కాలం లో 30 వేల కోట్ల స్కాం లో ఇరుక్కున్న శారద చిట్ ఫండ్ కంపెనీ గురించి  ఇప్పటికే చదువుతున్నాము.ఒకడి జేబు లో రూపాయి కొట్టేసిన వాడినో,వంద రూపాయలు లంచం తీసుకున్న వారినో వెంటనే జైల్లోకి పంపించే మన వ్యవస్థ ఇలాంటి బడా స్కాం దారులను వెంటనే ఎందుకు శిక్షించలేదో అర్ధం కాదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి