Pages

2, జులై 2013, మంగళవారం

చంద్ర బాబు ని అభినందించక తప్పదు ఈ విషయం లో..!



చిత్తూరు జిల్లాకి చెందిన జవాన్ యాదయ్య ఇటీవల వుగ్రవాదుల దాడిలో జమ్మూ కాశ్మీర్ లో మరణించిన విషయం పేపర్లలో చదివాము.అయితే చాలా మంది నోటి మాటగా సానుభూతిని వ్యక్తం చేసి వూరుకున్నారు.చంద్ర బాబు మటుకు అతని ఇటికి వెళ్ళి రెండు లక్షలు సాయం చేయడం అభినందించదగ్గ విషయం.

కొంతమంది అనొచ్చు సానుభూతి కొట్టేయాడానికి అని...కనీసం ఆ కారణంతోనైనా మిగతా వాళ్ళు ఆపని చేయలేక పోయారు.కాశ్మీర్ లో నేడు జరుగుతున్నది అప్రకటిత యుద్ధం.ఆ సంఘటన లో చనిపోయిన జావాన్ లకి ప్రతి ఒక్కరు సాధ్యమైనంత ప్రతి ఒక్కరు సహాయం చేయాలి.ఈ విషయం లో మొదటి చొరవ తీసుకున్న చంద్రబాబుని అభినందించక తప్పదు.

అసలు త్యాగం విలువ తెలుసుకొని గౌరవించడం లోనే మనిషి యొక్క గొప్పదనం బయటపడుతుంది.మన భారతీయులు పాశ్చ్యాత్యుల నుండి నేర్చుకోని ఒక గొప్పవిషయం ఏమిటంటే  త్యాగం అంటే ఏమిటో తెసుకొని దాన్ని గౌరవించడం....!

1 కామెంట్‌: