స్వరాభిషేకం పేరుతో చేసే పాటల సందడి బాగానే వుంది.కొన్ని చమక్కులు చెప్పుకోవాల్సినవి కూడా వున్నాయి.మంచి మధుర గీతాలు ఎన్నుకొంటున్నందుకు వారిని అభినందించాలి. ఆ రకంగానైన కొంత మంచి మెలోడి ని వినేభాగ్యం కలుగుతున్నది. ఆనంద్ పాడిన అమెరికా అమ్మాయి లోని ఆ సూపర్ హిట్ సాంగ్ బాగుంది.పాత జ్ఞాపకాలు రేపింది.రామకృష్ణ పాడిన అలనాటి ఆ పాత మధురం అమోఘం..!
అలా గుర్తు పెట్టుకోదగిన పాటలు ఒక్కటైనా వస్తున్నాయా ఇప్పుడు..? శైలజ పంతులమ్మ లో సుశీల పాడిన "మానస వీణ మధుగీతం" పాడింది గాని ఎందుకనో అంత నిండుదనం రాలేదు.బాలు ఓ.కె....!
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ అనే సాంగ్ బాగా పాడారు గాని background music లో వచ్చే ఆ మెయిన్ రిథం సరిగా అమరలేదు.అసలు దానికి ప్రాణం అదే..!
ఆకు చాటు పిందె తడిసే అనే పాట అన్న గార్ని గుర్తు చేసింది.అనగూడదు గాని చాలా దరిద్రపుగొట్టు పాటలకి నాంది పలికిన ఘనత కూడా ఆయనదే..!
ఎల్.ఆర్.ఈశ్వరి గొంతులో సెక్సీనెస్ బదులు ముసలితనం పలుకుతోంది.మల్లిఖార్జున లో మంచి potentiality వుంది.కాని సరైనా సాంగ్స్ పడటం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి