Pages

29, జూన్ 2013, శనివారం

భూ ప్రపంచం (After Earth) సినిమాపై నా రివ్యూ...!



విల్ స్మిథ్ ఇంకా అతని కుమారుడు జడేన్ స్మిథ్ నటించిన ఈ ఆంగ్ల చిత్రం తెలుగు లో డబ్బింగ్ అయ్యింది.ఎక్కువగా ఒక బాలుడే ఈ కధ అంతా నడిపించాడు.ఓ వెయ్యి ఏళ్ళ తరవాత భూమి నాశనం అయ్యి..అప్పుడు మనుషులు నోవా అనే గ్రహం మీద నివసిస్తూంటారు.ఆ గ్రహానికి చెందిన తండ్రి..కొడుకులే వీళ్ళిద్దరు.అలా స్పేస్ షిప్ లో వస్తూ ఈ భూమి మీద కూలబడుతుందది.దానికి సంబందించిన తోక (tail) ని తీసుకొస్తేనే వాళ్ళు బయటబడతారు.తండ్రికి కదల్లేని విధంగా ప్రమాదం జరుగుతుంది.ఆ కుర్రాడే ఈ బరువునంతా మోసి అనేక విచిత్ర జంతువుల్ని చంపుతూ సక్సెస్ అయ్యి..మొత్తానికి స్పేస్ షిప్ ని తిరిగి తమ గ్రహం వెళ్ళేలా చేస్తాడు.ఇదీ కధ..!

గతం లో మనకి తెలుగులో పాపం పసివాడు అనే సినిమా వచ్చింది.ఇంచు మించు కధ అలానే వుంది.కాకపోతే ఇప్పుడు టెక్నాలజి ఎక్కువైంది కనుక కొంత వెరైటీ వుంది. బాగా ఇంగ్లీష్ సిన్మాలు చూసే వాళ్ళకి ఇది పెద్దగా ఆనదు.అయితే చిన్నలకి ఎంటర్టైన్మెంట్ బాగానే వుంటుంది. విచిత్ర జంతువులు విచిత్రంగానే వున్నాయి.నైట్ శ్యామలన్ దర్షకుడు దీనికి..!

                                             Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి