కల్లు దుకాణాలు కాదు తెలంగాణాకి కి కావలసింది...చేతనైతే కెజి నుంచి పిజి దాకా ఉచిత విద్య.ఒక వర్గం వారిని ఆకట్టుకొనే ప్రక్రియలో భాగంగా కె సి ఆర్ కల్లు దుకాణాలు తెరిపిస్తామని చెప్పివుండవచ్చు.ఇంగ్లీష్ మందు ఎంత ప్రమాదమో మితి తప్పితే కల్లు అంతకన్నా ప్రమాదం.రెక్కాడితే డొక్కాడని ఎంతో మంది పులియబెట్టిన,ఇంకా రకరకాల చీప్ డ్రగ్స్ కలిపిన కల్లు తాగి ఆరోగ్యం ఘోరంగా చెడి పక్కమీది నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నారు..కేసియార్ కి అంతగా ప్రేమ ఉంటే కల్లు గీత కార్మికులని వేరే లాభదాయక వృత్తులలోకి వెళ్ళేట్టు చేయాలి తప్ప కల్లుని ఎంతమాత్రం ప్రోత్సహించరాదు. మన దేశం లో సెంటిమెంట్ కి తప్ప శాస్త్రీయ ధోరణికి తావు లేకపోవడం దురదృష్టకరం.Click here
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి