Pages

15, మార్చి 2014, శనివారం

పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి తెరమీదికి ఎందుకొచ్చినట్టు..?



ప్రజా జీవితం లో ఉండి ఎంతోకొంత ప్రజా సమస్యల మీద పనిచేసి ఉద్యమించి రాజకీయజీవితం లోకిరావడం ఎక్కడైనా పరిపాటి.కాని ఇప్పుడు రోజులు ఎలా తయారయ్యాయంటే సినిమాల్లో గ్లామర్ పెరిగి జనాలు అభిమానిస్తున్నారు అనగానే ఎకాఎకి రాజకీయ క్షేత్రం లోకి దిగి ఎం.పి. నో మంత్రి నో అయిపోయి కుతి తీర్చుకోవడం ఒక ఫేషన్ గా తయారయింది.సినిమా అనేది అనేక కళల్లో అది ఒకటి.అక్కడ అద్భుతం చేయవచ్చు.కాని రాజకీయ వ్యవహారాలకి ..పాలనకి..సమస్యలు తీర్చడానికి సంబంధం ఏముంది.ఈ దుస్సంస్కృతి తమిళనాడునుంచి మొదలయింది.ఆంధ్రాకి పాకింది.ఇదేదో బాగానే ఉందే అని కొనసాగిస్తున్నారు.

పవన్ ఉపన్యాసం వింటే అతని ఉద్దేశ్యం ఏమిటో అతనికే సరైన అవగాహన లేదు అనిపించింది.ఎవరి చేతిలోనో పావుగా కొన్ని వోట్లు చీల్చడానికి అతను ఉపయోగపడుతున్నాడు అంపిస్తున్నది.రాజకీయ నాయకుని కనీస లక్షణాలు అతని లో మచ్చుకి లేవు.కేవలం చప్పట్లు కొట్టించే డైలాగులు చెప్పడం కాదు.ఒడి దుడుకులలో తట్టుకొని నిలబడడం...ప్రజా సమస్యలపై కార్యక్షేత్రం లో పనిచేయడం..వివిధ రాజకీయ శక్తులతో రకరకాల యుక్తులతో నెట్టుకురావడం...ఇవన్నీ పవన్ ఏ మేరకు చేయగలడు..?హిట్ అయితే ముందుకొస్తా..ఫట్ మంటే దుకాణం మూసివేస్తా ..అనుకునేవాళ్ళు రాజకీయాలలో కి రావడం అంత అవసరమా..?

ఇప్పటికున్న పార్టీలు చాలకనా...వాటిని సంస్కరించుకొని ముందుకుపోతే చాలు. ఉనంట్టుండి సస్పెన్స్ సినిమాలా విడుదలయిన పవన్ ఆవేశం ఎన్నినాళ్ళు నిలబడుతుందో  గతంలో చూడలేదా జనం..?  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి