Pages

22, మార్చి 2014, శనివారం

"రాజా రాణి" సినిమా పై నా రివ్యూ



ఏ మాత్రం కాస్త వెరైటీ వున్నా,కొద్దిగా కొత్తదనం ఉన్న తెలుగు ప్రజలు సినిమా ని తప్పక ఆదరిస్తారు.అది డబ్బింగా,మరొకటా అనేది ప్రేక్షకుడికి అనవసరం.రాజా రాణి తమిళ్ వెర్షన్ కి తెలుగు అనువాదమే దానికి మంచి ఉదాహరణ.నయనతార,ఆర్య,నజ్రీం నజ్రియా  ఇంకా సంతానం లాంటి వారు ఈ సినిమాకి చక్కని వెన్నుదన్నుగా నిలిచారు.ఎంత చక్కని కధకైన దానికి న్యాయం చేసే తారాగణం కుదిరితేనే పండుతుంది.

ప్రతి ఒక్కరి జీవితం లోను ఒక ప్రేమకధ ఉంటుంది.అది ఫెయిల్ అయినా కొంపలేమీ మునగవు జీవితం ముందుకు వెళ్ళిపోతూనే మరో ప్రేమని పొంది సేదతీరుతుంది.ఈ కాన్సెప్టే దీని ఇతివృత్తం.చెప్పిన విధానం బాగుంది.నాలుగు పాత్రల్ని చక్కగా నడిపాడు దర్శకుడు.  సన్నివేశాల రూపకల్పనలో కొత్తదనం ఉంది.పాటలు ఒకమాదిరిగా ఉన్నాయి.ఫోటోగ్రఫీ బాగుంది.పాత్రధారులు వారి పాత్రలకు చక్కగా అమిరారు.

దర్శకుడు అట్లీ కుమార్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది.హీరో హీరోయిన్ లు క్రిస్టియన్ నేపధ్యం కలిగిఉండి కధనడవడం తెలుగు వాతావరణానికి కొత్తగా ఉన్నా ఆకట్టుకొంటుంది.భార్య భర్తకి..తండ్రికి బీర్ లు కొనిచ్చి ఆకట్టుకోవడం పెద్దగా తప్పుకాదనే సందేశం ఈ చిత్రం ద్వారా వస్తుంది.

బహుశా తమిళ్ ఒరిజినల్ లో హీరోయిన్ పాత్ర చెన్నై లో స్థిరపడిన మళయాళీ కావొచ్చునని ఒక సన్నివేశం ద్వారా అనిపిస్తుంది.ఎండకాలం లో ఓ చల్లని బీర్ తాగినట్టుగా ఉంటుంది.ఓ సారి చూడండి.Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి