Pages

25, మార్చి 2014, మంగళవారం

కెసీఆర్ కి ఓ సారి సి.ఎం.గిరి ఇవ్వడం లో తప్పేముందని..?



సొల్లు రాజకీయాలు,కుతంత్ర నీతులు పక్కన పెడితే కె.చంద్రశేఖర్ రావు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నూటికి నూరు పాళ్ళు అర్హుడు.ఎందుకు కాడు..?అతను ఎవరి వారసత్వాన్నో అడ్డంగా పెట్టుకొనో పైకి ఎదగలేదు అది గుర్తు పెట్టుకోవాలి.తెలంగాణా ప్రజల్లో ఉన్న రాష్ట్ర ఆకాంక్షని దాని మూలాల్లో కెళ్ళి అర్ధం చేసుకొని అనేక రకాలైన ఒడిదుడుకులను ఎదుర్కొని అన్ని కులాలను,వర్గాలను,ఉద్యోగులను అనేక వ్యూహాల తో సమైక్యపరచి కేద్ర ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి తెలంగాణాని సిద్దింపజేయడం లో కీలక పాత్ర వహించాడు. చివరికి కరుడుగట్టిన తెలంగాణా వ్యతిరేకులని సైతం దానికి తలవొగ్గెలా చేయగలిగాడు.ఎన్నో తిట్లని సహించాడు.తెలంగాణా కోసమే అతను నిలబడ్డాడు.అది ఒప్పుకొని తీరాలి.అసలు ఈరోజున తాగని..ఇంకా అనేక వెధవ వేషాలు వేయని పొలిటీషియన్ ఎవడున్నాడని...?తాగడం అతని వ్యక్తిగతవిషయం ..దానివల్ల ఎవరికీ ఏ నష్టమూ లేదు. కాని దాన్ని ఆసరగా చేసుకొని చీప్ పబ్లిసిటి చేసుకొనే వారిది బురదలో పందికంటే దారుణం..!రాజీవ్ గాంధి ఇందిరా తనయుడు కాకుంటే ఎప్పటికైనా ప్రధానమంత్రి కాగలిగే వాడా..?చద్రబాబు ఎన్.టి.ఆర్. అల్లుడు కాకపోతే జన్మలో ముఖ్యమంత్రి కాగలడా..? ఆ రేంజి కి వాళ్ళు చేసిన కృషి ఏమిటి..?పోరాటాలు ఏమిటి..?జనాల్లో మమేకమై చేసింది ఏమిటి..?మనిషి గా పుట్టిన తరవాత ఒక్కసారైనా నిజమైన రాజనీతిజ్ఞులను మెచ్చుకుని తీరాలి.అప్పుడే మనిషి జన్మకి సార్ధకం. చంద్రశేఖర రావు ఎవరు ఒప్పుకున్నా లేకున్నా మనతరం చూసిన ఒక నిజమైన యోధుడు. అలాంటి వ్యక్తి కి ముందు అయిదు సంవత్సరాలు అధికారం ఇవ్వడం లో తప్పు ఏముంది. తెలంగాణా సిద్దించడం ఎంత చారిత్రక అవసరమో...దాన్ని అభివృద్ది చేసితీరడం కూడ అంతే అవసరం.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి