Pages

31, మార్చి 2014, సోమవారం

బి జె పి తో పొత్తువల్ల లాభపడేది తెలుగుదేశమేననడం లోసందేహమే లేదు.



ఓ వైపు ఆంధ్ర లోను,మరోవైపు తెలంగాణ లోను బిజెపి తో పొత్తువల్ల నిజంగా ఆలోచిస్తే లాభపడేది తెలుగుదేశమే ననడం లో  సందేహమే లేదు.రేపు నరేంద్ర మోడి అధికారం లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం తో మిత్రపక్షంగా ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చు.అలాగే ఉద్యోగుల్లో,రైతుల్లో ఇంకా కమ్మకులేతర ప్రజల్లో ఇప్పటికే  కోల్పోయిన పట్టుని నిలబెట్టుకోవచ్చు.అలాగే పాత కుంభకోణాల్లో సి. బి.ఐ.లాంటి సంస్థలనుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరగవచ్చు.  కనకనే ఎలాంటి పరిస్థితులలోను పొత్తు కుదుర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు చాలా చురుకైనవాడు..అవసరాన్నిబట్టి వెంటనే విధేయతల్ని మార్చిపారేస్తుంటాడు.జగన్ ని జైలు కి పమ్మించడం లోను ..ఇంకా అతనికున్న ఇమేజ్ ని ఎంతోకొంత దెబ్బకొట్టడానికి ఎటువంటి సంకోచాలు లేకుండా ఓ వేపు కిరణ్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటు..మరోవేపు చిదంబరం అండ్ కో తో తెరవెనుక స్నేహాలు నెరిపారు.

ఇప్పటికీ తలబద్దలుకొట్టుకున్న అర్ధం కాని విష్యం ఏమిటంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంతవరకు ఎవ్వరూ చేయనన్ని స్కాం లు,కుంభకోణాలు చేసి..రాజకీయాన్ని ఒక ఫక్తు వ్యాపార వస్తువుగా  చేసిన సంస్కృతి అసలు భారతదేశం లోనే మొట్ట మొదటిగా ప్రవేశపెట్టిన ప్రత్యేకత మన బాబుదే...!అది చూసి చాలామందికి కన్ను కుట్టిన మాట వాస్తవం. ధనమంటే ఎవరికి చేదు...వై.ఎస్.పదవి లోకి వచ్చినతరవాత కొంతదాక బాబు నే ఆదర్శంగా తీసుకున్న మాటనిజమే.తమకంటూ మీడియా,పత్రిక లు ..లాంటి సరంజామాలు లేకపోతే ఈ మనీ క్రీడ లో దేశం తో నెగ్గుకురాలేమని అతను భావించి ఉండవచ్చు.

ఎంతైనా క్రైస్తవుడు కదా...కొద్దిగా మానవీయ కోణాన్ని జోడించి పెన్షన్లని,పిల్లగాళ్ళకి చదువులకని...ఇట్లా కొన్ని ఉచిత ఫలహారాలు పెట్టాడు.దానివల్ల జనాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.అయితే జగన్ చేసిన పెద్ద తప్పు ఏమిటంటే వై.ఎస్ పోయినతర్వాత తన సాక్షి పేపర్ లో సోనియా గాంధి ని అతి దారుణంగా ఏకిపారేయడం మొదలుపెట్టాడు.అసలు కొన్నిసార్లు సెన్సార్ కటింగులు చెప్పవలసిన వ్యంగాన్ని కూడా జోడించేవారు.ఏందబ్బా ఈ పిల్లవాడు ఇంత స్పీడు గా పోతున్నాడు అనుకున్నా అప్పుడే....ఇగ ఆ తరవాత కతలన్నీ అందరకీ తెలిసినవే..!  Click here



1 కామెంట్‌: