ఈరోజు ఈనాడు లో ఓ వార్త చదివాను.నల్గొండ జిల్లా లోని హుజూర్ నగర్ లో మీసాల బాలమ్మ అనే వృద్దురాలు మున్సిపాలిటీ లో పనిచేస్తున్నది.ఆమె మరో రెండు నెలల్లో రిటైర్ కానున్నదట.ఆమె మనుమడు,కొడుకు ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు.ఏమిటంటే ఆమె ఊరికే రిటైర్ అయితే తమకేం ఒరుగుతుంది..మధ్యలో..జాబ్ లో ఉండగా పోతే వీళ్ళ లో ఒకరికి కంపాషన్ గ్రౌండ్స్ లో ఉద్యోగం వస్తుందని ఆలోచించి ..రాత్రి పూట ఆ ఇద్దరూ కలిసి దిండు ముఖం మీద అదిమి హత్యా యత్నం చేశారట.అప్పటికీ ప్రాణం ఉండటం తో ఓ ఆర్ ఎం పి ద్వారా చంపాలని చూశారు. చివరికి ఆమె కూతురు పోలిస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనుకోండి.
ఇవ్వాళ రేపు ఇంట్లో అంత దగ్గర బాధవ్యం ఉన్నవాళ్ళే చంపడానికి తయారు అవుతున్నారంటే డబ్బు ఎంతకి తెగింపజేస్తుంది అనిపించడం లేదూ..!Click here
మాతా పుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః
రిప్లయితొలగించండిAnte..? Poorthi ga ardham kaaledu..syamaleeyam gaaruu.
తొలగించండి