Pages

21, డిసెంబర్ 2014, ఆదివారం

మహిళా డిటెక్టివ్ ల పని బాగానే ఉంది..!



ఢిల్లీ లో ఉండే గుర్దాస్ సింగ్ కి తన భార్య మీద అనుమానం వచ్చింది.ఆ కుటుంబం ఢిల్లీ లోని రోహిణి ఏరియా లో ఉంటుంది.ఎనిమిది ఏళ్ళు అయింది వాళ్ళ వివాహం అయి..!
 అతను వ్యవహారం కూపీ తీయడానికి తేజాస్ డిటెక్టివ్ సంస్థ అధినేత భావనా పాలివాల్ ని కలిశాడు.ఆమె రంగం లోకి దిగిపోయింది.సరిగ్గా వారం తర్వాత గుర్దాస్ కి ఫోన్ చేసింది..అతని భార్య  ప్రస్తుతం ఢిల్లీ లోని ఓ మాల్ లో ఓ  వ్యక్తి తో కలిసి షాపింగ్ చేస్తున్నదని..వెళితే చూడవచ్చని.వెంటనే గుర్దాస్ వెళ్ళి వాళ్ళిద్దర్ని రెడ్ హేండెడ్ గా పట్టుకున్నాడు.ఇంతకీ ఆ కొత్త వ్యక్తి ఎవరంటే ఫేస్ బుక్ లో పరిచయమైన ఒక దక్షిణాఫ్రికా కుర్రాడట.

భావనా పాలివాల్ కొన్ని పరిశోధనల్లో కొందరి జీవితాలు కూడా కాపాడినట్లు చెబుతున్నది.ఒక గేంగ్ స్టర్ గుట్టు కనిపెట్టి కిడ్నాప్ చేయబడిన ఒకమ్మాయిని కాపాడింది. ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఈమె మొదట జర్నలిస్ట్ గా ఉండి ఆ తర్వాత డిటెక్టివ్ గా మారింది.ఈ వృత్తిలో అవసరమైనప్పుడు రకరకాల గెటప్ లు మార్చవలసి ఉండటం,ఓర్పు తో సమాచారాన్ని రాబట్టడం ఇవన్నీ ప్రధానాంశాలు.పెళ్ళికి ముందు అబ్బాయి/అమ్మాయి గురించి తెలుసుకోవడానికి,ఆర్దికపరమైన ఫ్రాడ్ కేసులు,మిస్ అయిన వారిని కనిపెట్టడం వంటివి ఇలాంటివి బాగా వస్తుంటాయిట.

పంజాబ్ నుంచి ఢిల్లీ కి వచ్చి ఈ వృత్తి లో ఉన్న ఆకృతి ఖత్రి కూడా తన అనుభావాలు పంచుకుంటూ సీక్రెట్ ఇంఫర్మేషన్ సేకరించడానికి వివిధ వర్గాల వారితో మాటలు కలపడానికి మహిళ లకి సౌకర్యం బాగా ఉంటుందని తెలిపింది.తన క్లయింట్లకి ఒక్కోసారి టార్గెట్ చేయబడిన వారి మొబైల్స్ లో పెట్టడానికి చిన్న పరికరాలు ఇస్తుందిట..దానివల్ల ఆ ఫోన్ నుంచి చేసే కార్యకలాపాలు అన్నీ ఇవతల వ్యక్తి కి తెలిసి పోతుంటాయిట.ఇప్పుడు స్త్రీలు కూడా బాగా తెలివిమీరి పోయారని ,ఒకామె తన భర్త కి ఉన్న ఇతర సంబంధం గురించి ఎవిడెన్స్ ఇమ్మని కోరగా..అవి ఏం చేసుకుంటారంటే ..ఏముంది నా వ్యవహారానికి అడ్డువచ్చినప్పుడు దీన్ని చూపెడతా అందిట. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి