నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఈ మధ్య వెళ్ళినపుడు ఓ విచిత్రమైన సమస్య చెప్పారు వాళ్ళు. వాళ్ళ అమ్మాయి తొమ్మిదవ తరగతి చదువుతోందట. స్కూల్ లో ఇతర ఫ్రెండ్స్ తో కలిసి ఓజో బోర్డ్ (Ouija board) ఆడిందట ఓ రోజు.ఇంటికి రాగానే విపరీతమైన భయం తో పడుకుండి పోయిందట.జ్వరం కూడా వచ్చిందట. మీరు నానా రకాల పుస్తకాలు గట్రా చదువుతుంటారు గదా.అలాంటివి ఆత్మలు రావడం బోర్డ్ గుండా సమాధానం ఇవ్వడం లాంటివి ఉంటాయా అని నన్ను అడిగారు.
ఓసారి మీ అమ్మాయిని పిలవండి అని చెప్పగా ఆ అమ్మాయి ని నా ముందుకు పంపించారు. వాళ్ళు పక్కనే కూర్చున్నారు. "అసలు ఏం జరిగింది పాపా...పూర్తి వివరాలు చెప్పు...నీకు ఎలాంటి భయం లేదు చెప్పు" అన్నాను. అప్పుడు ఆ పాపా చెప్పినదాని ప్రకారం ఏమైందంటే క్లాస్ లో ఉన్న ఇద్దరు మరో అమ్మాయిలు ఈ ఓజా బోర్డ్ గురించి ఈ అమ్మాయికి చెప్పారు.ఆసక్తి కొద్దీ ఇద్దరు ,బోర్డ్ కి అటు ఒకరు,ఇటు ఒకరు కూర్చుని ఆత్మలతో మాట్లాడటం చేశారు.వీళ్ళు బోర్డ్ మీద ఉన్న అక్షరాల మీద చేతులు తాకిస్తూ అడుగుతుండగా ఓ ఆత్మ వచ్చిందిట,దానికి గుర్తు గా మధ్యలో వెలిగించిపెట్టిన కేండిల్ టప్పున ఆరిపోయిందట.
ఆ తర్వాత కొన్ని ప్రశ్నలకి జవాబుగా కొన్ని సమాధానాలు వచ్చాయిట. ఇదీ స్థ్హులంగా ఆ అమ్మాయి చెప్పింది. ఆ కేండిల్ ఆరిపొయింది గాలి తాకి అయ్యుంటుందిలే అన్నాను.లేదు అంకుల్ అప్పుడు గది తలుపులు వేసి ఉన్నాయి.ఏ గాలి లేదు అందామ్మాయి. అలాంటివి ఏమీ నమ్మకు ...అవి అన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన మూఢనమ్మకాలు వంటివే. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకో పాపా..ఏ దుష్ట శక్తి నీదగ్గరకి రాదు,రాలేదు సరేనా..అని చెప్పి ధైర్యం చెప్పి వచ్చేశాను.చిన్న వయసులో ఉన్న పిల్లల్ని మరీ భయపెట్టకూడదని అలా చెప్పాను.మీకు తెలిస్తే చెప్పండి ఎవరైనా ఈ ఓజా బోర్డ్ లు అవన్నీ నిజంగా అలా ఆత్మలకి మాధ్యమం గా పనిచేస్తాయా..?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి