Pages

8, జనవరి 2017, ఆదివారం

బాలకృష్ణ , చిరంజీవి సినిమాల పబ్లిసిటీ స్టంట్లు


ఓ వైపు ఖైదీ నం.150 ఇంకో వైపు గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రెండు సినిమాలు అతి త్వరలో రీలీజ్ కాబోతున్నాయి.ఈ నేపధ్యం లో రేగుతున్న వేడి, అభిమానుల ఆవేషకావేషాలు చూస్తుంటే ఈ అజ్ఞానపు దురద ఎప్పటికి పోతుందో అర్ధం కావట్లేదు.ఇంతకీ వచ్చీ అవి ఏమన్నా జాతీయ అంతర్జాతీయ స్థాయి లో పేరు తెచ్చే సినిమాలా అంటే ఒకటి ఏమో తమిళం నుంచి రీమేక్ కాగా ఇంకోటి ఏమో ఆధారాలు రవ్వంత ఉంటే నానా కధలు దానికి దట్టించి అదే గొప్ప స్టోరీ అన్నట్లు విపరీతమైన డబ్బా.చరిత్ర ని గౌరవించి సాధ్యమైనంత దగ్గరగా తీయాలి కాస్ట్యూం లు అయితేనేం..ఇంకోటి అయితేనేం.! కాని కిలోల కొద్దీ గోల్డ్ వంటి  మీద దిగవేసుకొని ,ఆ ఆహార్యం చూస్తుంటే చరిత్ర తెలిసిన వారికి చికాకు పుడుతుంది. ఇప్పటి దాకా బయలుపడిన    ఏ ప్రాచీన  శిల్పాల్లొనూ అలాంటి ఆహార్యం కనబడదు.ఎవరు ఫేన్సీ కి వాళ్ళు తీస్తున్నప్పుడు తెలుగు చరిత్ర అని చెప్పుకోడము ఎందుకు..?

అమ్మడు..కుమ్ముడు అనుకుంటూ పాటలతో మరొక సినిమా సిద్దమవుతున్నది.ఈ మధ్య వచ్చిన దంగల్ సినిమా చూడండి.ఆ విధంగా హృదయాన్ని కరిగిస్తూనే సందేశం ఇవ్వగల సినిమాలు మన తెలుగు స్టార్స్ వాళ్ళ బ్రతుకుల్లో తీయగలరా..?చీప్ టెక్నిక్స్ తో కులాల్ని ,రాజకీయాల్ని వాడుకుంటూ చలామణీ అయ్యే వీళ్ళు రాష్ట్రం దాటితే ప్రతి వాళ్ళూ వీళ్ళని  పరిహాసం చేసే వాళ్ళే.వీళ్ళ అజ్ఞానానికి నవ్వుకునే వాళ్ళే.  

29, డిసెంబర్ 2016, గురువారం

ఇది ఒక అరుదైన సంఘటన..కానీ పట్టించుకున్న వారేరి...!!


ఈ నెల 27 వ తారీఖున పేపర్ న్యూస్ ప్రకారం  తెలంగాణా రాష్ట్రం లోని పెద్ద పల్లి ఇంకా మంచిర్యాల పరిసరాల్లో ఒక మంచి ఘటన జరిగింది.ఆ ముందు రోజు ఆయా ప్రాంతాల్లోని మతి స్థిమితం లేకుండా బజార్ల లో తిరిగే అభాగ్యుల్ని  అందర్నీ తీసుకొచ్చి వాళ్ళకి తైల సంస్కారం చేయించి,స్నానాలు చేయించి,నూతన వస్త్రాలు ధరింప జేసి ఒక హోం కి పంపించడం అనేది ఒక గొప్ప విషయం,అందునా పోలీసు అధికారులు ఈ పనికి పూనుకోవడం అభినందించదగ్గ అంశం.మనం ప్రతి రోజు ఇలాంటి వాళ్ళని,జంతు ప్రాయంగా జీవిస్తున్న మానవుల్ని చూసి వెళ్ళిపోతుంటాము,ఏమి చేయాలో తెలియక,ఎవరికి చెప్పాలో తెలియక.

ఎన్.జీ.వో. లు ఎంతోకొంత చేస్తున్నా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.ఈ సత్కార్యాన్ని ప్రారంభించిన రామగుండం పోలీస్ కమీషనర్ విక్రంజిత్ దుగ్గల్ గారిని మనసారా అభినందించాలి,ఎప్పుడూ సొల్లు రాజకీయాలే కాకుండా ఇలాంటి ఘటనలు జరిగినపుడు కవరేజీ ఇవ్వడం మీడియా ప్రతిష్టని కూడా పెంచుతుంది.  

4, డిసెంబర్ 2016, ఆదివారం

రాం గోపాల్ వర్మ చేయబొయేది పరమ తప్పు



ఏదైతే జనాల్లో సంచలనం రేపుతుందో దాన్ని తీసి పబ్బం గడుపుకుందాము అనుకొనే స్థితి వచ్చిందో అప్పుడే అతగాని క్షీణ దశ ప్రారంభం అయిందని అర్ధం.రాం గోపాల్ దశ ప్రస్తుతం అలానే ఉంది.లేకపోతే వంగ వీటి మీద సినిమా ఏమిటి..అతడు ఒక ఆదర్శ పురుషుడా..?ఇంకొకటా..?ఇన్నాళ్ళ బాటు కమ్మ లేదా కాపు కుల దర్శకులు ఆ సబ్జక్ట్ మీద సినిమా తీయ లేక ఊరుకోలేదు.చల్లారిన గాయాలను రేపడం ఇష్టం లేక ఇరు వర్గాలు మౌనం వహించాయి. ఆ విధంగా చాలా మంచి జరిగింది,శాంతి భద్రతలు నశించడం వల్ల సమాజం లోని మిగతా అన్ని వర్గాలు దెబ్బతింటాయి.రకరకాల విషయాల్లో..!!

కాని తాను మాత్రం స్పెషల్ అంటూ కెలుకుతున్న ఈ సినిమా వల్ల ఏ నష్టం సమాజం లో వాటిల్లినా దానికి బాద్యుని గా వర్మ ని చేయవలసి ఉంటుంది.ప్రజలు గావచ్చు ప్రభుత్వం గావచ్చు ఇలాంటి బాధ్యతా రాహిత్య సినిమాలని నిరసించవలసిన అవసరం ఉంది.

2, డిసెంబర్ 2016, శుక్రవారం

"బేతాళుడు" సినిమా పై రివ్యూ



ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందే బాగా అంచనాలు పెంచింది.కారణం బిచ్చ గాడు సినిమా తో మంచి పేరు సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని.అతను ఈ సారి ఏ రూపం లో రానున్నాడో అని ఉత్ఖంట రేపింది.ఈ బేతాళు డు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పాలి.ఇంటర్ వెల్ దాకా మామూలు హారర్ సినిమా లా నడిచింది.ఆ తర్వాత కొన్ని ట్విస్ట్ ల తో అలరిస్తుంది.ఈ తరహా సినిమాలు బొత్తిగా రాకపోలేదు గాని స్క్రీన్ ప్లే లో ఉన్న కొత్తదనం చేత కధా గమనం బోరు కొట్టదు.నిజానికి విజయ్ లో అన్ని భావాలు సరిగా పలకవు.దాన్ని బాగా ఎరిగి ఎక్కువ డ్రమటైజ్ చేయకుండా సన్నివేశాల్ని దానికి అనుగుణంగా తీర్చి దిద్దారు.

హీరోయిన్ గా నటించిన అరుంధతి నాయర్ పరవాలేదు. కాసేపు గత జన్మకి ,కాసేపు మెడికల్ సైన్స్ కి ముడివేసి ఇతివృత్తాన్ని లాగించారు.సంగీతం ఓకే.కధ చెప్పిన విధానం బాగుంది.అదే సినిమా ని నిలబెట్టింది.వీలుంటే ఓ సారి చూడవచ్చు. 

4, నవంబర్ 2016, శుక్రవారం

"కాష్మోరా" సినిమా పై రివ్యూ


వాల్ పోష్టర్ లు ఇంకా ఇతర పబ్లిసిటి చూస్తే ఇదొక ఫక్తు హారర్ సినిమా అనుకుంటాము.కాని ఒక రకంగా కామెడి సినిమా అనుకోవచ్చు.ముందు హారర్ బిల్డప్ ఇచ్చినా ఆ తరువాత కామెడి గా మారుతుంది.సెకండ్ చూసి వచ్చినా హాయి గా ఏ పీడ కలలు లేకుండా నిదరపోవచ్చు.కొన్ని తెలుగు సినిమాల్లోని సీన్లు తీసుకొని కొద్ది గా మార్పు చేర్పులు చేసి ఇది తీశారు.అయితే కార్తి పాత్రల విషయం లో  ...ముఖ్యంగా డబల్ రోల్స్ లో మంచి వేరియేషన్ చూపించాడు.రాజ్ నాయక్ గా ప్రేక్షకులకి గుర్తుండి పోయే పాత్ర చేశాడు.తమిళ్ వెర్షన్ లో దెయ్యాల ప్యాలస్ ఆంధ్ర లో ఉంటుంది...తెలుగు వెర్షన్ లో తమిళ నాడ్ లో ఉన్నట్లు మార్చారు.చిత్రం లో కొన్ని లొసుగులు ఉన్నా ఒకసారి చూడవచ్చు.నయనతార డీగ్లామర్ అయినట్లు కనిపించింది.

18, అక్టోబర్ 2016, మంగళవారం

"ప్రేమమ్‌" సినిమా పై నా రివ్యూ



మొట్టమొదటి గా నాకు ఒక సందేహం "ప్రేమమ్‌" అనే మాట సరైనదేనా..? మళయాళం లో ఆ పేరు ఉందని  అట్లానే తెలుగు లో కూడాపెట్టేశారు.అది అటు ఉంచితే...మూడు దశల్లో మనిషి లో కలిగే భావ పరిణామాల్ని దీనిలో చిత్రించారు.బహుశా గతం లో వచ్చిన "ఆటోగ్రాఫ్" సినిమా కధ ఇన్స్పిరేషన్ అయిఉండవచ్చును.ఈ కధా సంవిధానం కేరళ వాతావరణం లో నప్పేదే.మన తెలుగు లో కొన్ని మార్పులు చేశారు.అక్కడ క్రిస్టియన్ వాతావరణం లో సాగుతుంది సినిమా అంతా...!యూట్యూబ్ లో చూస్తుంటే దానికింద చేసే కామెంట్లు అన్నీ తెలుగు రీమేక్ ని కించపరిచేవిగా ఉన్నాయి,మంచి ఫీల్ ఉన్న సినిమా ని పాడు చేశారని వాళ్ళ బాధ.పాపం వాళ్ళకేం తెలుసా..మన తెలుగు కధా దారిద్ర్యం ఇంకా ఇక్కడి పోకడలు.అనుపమా పరమేశ్వరన్,మడోన్నా సెబాస్టియన్ ని ఉంచి సాయి పల్లవి స్థానం లో శృతి హాసన్ ని తీసుకున్నారు ఇక్కడ.దాంతో ఓ మూస ఫిల్మ్ లుక్కే వచ్చింది.అప్పటికీ కొన్ని కొకేషన్ లు అక్కడివే తీసుకున్నారు.


నాగ చైతన్య నటించిన చిత్రాల్లో కొంత మెరుగైనది గా చెప్పవచ్చు.మళయాళీ హీరో ని అనుకరించాడు..అది కనబడుతూనే ఉంది.ఒక మాదిరి సినిమా ..అంతే తప్ప రికార్డ్ కలెక్షన్ లు వస్తాయంటే అది అనుమానమే.ఒకటీ అర పాటలు బాగున్నాయి.కెమెరా పనితనం ఫరవలేదు.

10, అక్టోబర్ 2016, సోమవారం

తెలంగాణా ప్రభుత్వం చేసిన ఈ పనిని ఆంధ్ర ప్రదేశ్ చేసే వీలుందా..?


ఎట్టకేలకు బతుకమ్మ పండుగ ని రాష్ట్ర ప్రభుత్వ అధికార వేడుక గా ప్రకటించి తెలంగాణా లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ఇంకా ఇతర కార్యాలయాల లో జరిగేటట్లు చేసింది.కుల,మత ,వర్గ భేదాలు లేకుండా ఈసారి తెలంగాణా నలుమూలలా ఈసారి ఇవి జరిగాయి.ఆంధ్ర ప్రభావం ఎక్కువ గా ఉండి ఈ పండుగని  పెద్ద గా పట్టించుకోని ప్రాంతాల్లో సైతం పరిస్థితి మారిపోయి తప్పనిసరిగా బతుకమ్మ పండుగని చేసుకోవలసి వచ్చింది.ఆ విధంగా తెలంగాణా కి ఆత్మ లాంటి ఈ వేడుకని కెసీఅర్ ప్రభుత్వం పునరుజ్జీవింపజేసినట్లయింది.తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన లోను ఈ వేడుక ప్రజల్ని కలిసిగట్టు భావాన్ని ప్రొది జేసింది అనడం లో అతిశయోక్తి లేదు.ఇదే విధంగా ఒక సాంస్కృతిక ఐక్యత ని ఉద్దీపింప జేసే వేడుక ఆంధ్ర ప్రాంతం లో లేదా..ఉన్నా పెద్ద గా పట్టించుకోపోవడమా..?కోస్తా లోని సినిమా కల్చర్ లో సకల ఇతర విషయాలు  నిర్లక్ష్యం చేయబడటమే దీని వెనుకనున్న కారణమా..?