మంజుల...ఎంత అందమైన పేరు..! ఆ పేరుకి లాగే ఆమె లావణ్యం ,రూపు రేఖలు కూడా అంత అందమైనవి.చక్రాల్లాంటి భావ స్ఫోరకమైన కళ్ళు..ఆకర్షణీయమైన నవ్వు..చక్కని పలువరుస..దానిమ్మ పండు వంటి చ్చాయ.. మిస మిస లాడే వొళ్ళు ..తలుచుకుంటేనే అబ్బ ఒకసారి కొరుక్కుతినాలనే అందం..! 70 ల లో ఆమె నటించిన సినిమాలు ..అంత తొందరగా మరిచిపోఏవా ..?జేబు దొంగ..మాయదారి మల్లిగాడు...ఇట్లా ఎన్ని సినిమాల్లో కనువిందు చేసిందో..!
అందం ..నటన..నృత్య కళ ఈ మూడు విషయాల్లో మంజుల నిష్ణాతురాలు.అదే ఆమె ప్రత్యేకత.చాలామంది లో ఒకటి వుంటే ఒకటి వుండదు. కాని ఆ మూడిట్లో మంజుల తీరే వేరు.ఆమె ని వేరెవరితో కూడా పోల్చలేము. ఇప్పటికైనా మంజుల సినిమా ఒకటి చూడండి..ఆ రాత్రికి అంత తొందరగా నిద్ర పట్టదు.ఆ విజయ్ కుమార్ ఎంతటి అదృష్టవంతుడా అనిపించక మానదు.
వయసు మీరిన తర్వాత కూడా ఆమె లో అదే అందం.కాకపోతే కొంత లావు అయింది అయినా అది ఇంకొక ఆకర్షణ గా వుండిందే తప్ప ఎబ్బెట్టుగా లేదు.మరి ఆ దేవుడు కొంతమందికి అలాంటి మేజిక్ ఫిగర్ ఇస్తాడు ఎందుకో..!
ఐతే అందం ఒక్కోసారి ముందుకు పోవడానికి తోడ్పడినట్టే ...ఇతరుల్లో అసూయ నింపి వెనక్కి లాగడానికి కూడా కారణభూతమౌతుంది.ఆమె కామెర్లతో నిన్న ఆసుపత్రి లో కను మూయడం అశేష అభిమానులని బాధించింది.మళ్ళీ ఆ ఆత్మ ఎక్కడ తన నూతన శరీరం తీసుకోనున్నదో..!
Click here for more
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి