Pages

31, జులై 2013, బుధవారం

మన వీధి కుక్కలకి సరైన పోషణ,సౌకర్యం కల్పించాలేగాని ప్రపంచం లోని యే మేలు జాతి కుక్కలకన్నా తీసిపోవు


మన వీధి కుక్కలకి సరైన పోషణ,సౌకర్యం కల్పించాలేగాని ప్రపంచం లోని యే మేలు జాతి కుక్కలకన్నా తీసిపోవు అనేది నా ధృఢ అభిప్రాయం.German Shepherd లా బలంగాను,భయరహితంగాను ఉండగలవు.DobberMan,LaabraaDar,Boxer లాంటి విదేశీ జాతి కుక్కలకిదేనిలోనూ తీసిపోవు.కాని మనం వాటిని యెక్కడ చేర్చుకొని మంచి పోషణ ఇచ్చి వాటి జాతిలోని గుణాలని వృది చేస్తున్నాము..?

ఎంతసేపు విదేశీ మోజే..!చివరికి కుక్కల పెంపకంలో కూడా..!మన వాళ్ళ మోజు కనిపెట్టే ననుకుంటా ఆర్మీనియా లాంటి కొన్ని దేశాల్లో అక్కడి వీధి కుక్కల్ని పట్టి India లో అమ్మడానికి ఒక మాఫియా నే యేర్పడిందట.ప్రస్తుతం కుక్క పిల్లని పెంచడం ఓ స్టేటస్ సింబల్ గాను,ఇంకొంతమందికి ఓ ఫేషన్ గాను పరిణమించిది.సరే..!కుక్క వున్నది జాగ్రత్త అనే బోర్డ్ ఇంటిముందు చూడగానే ఎంత కొమ్ములు తిరిగిన మొనగాడైనా ఎకాఎకి లోపలకి రావడానికి భయపడతాడు...అదీ శునకం ఇచ్చే రక్షణ..!

Alsation,German shepherd  ఒకటే జాతి గాని బ్రిటీష్ వాళ్ళు జెర్మన్ షెప్పర్డ్ కుక్కల్ని జర్మని ,ఫ్రాన్స్ దేశం సరిహద్దు ప్రాంతమైన ALSACE-LORAINE పేరుమీదుగా అల్సేషియన్ కుక్కలుగా పిలిచి ఆ పేరుని విశ్వ వ్యాప్తం చేశారు.కుక్కల  విశ్వాస పాత్రతని చవి చూడక పోతే అలాంటి వారికి ఎద లోపల తడి ఏమిటో అర్ధం కాదు.

మన దేశం లో కుక్కలని పెంచుకునేవాళ్ళు ఎందుకని దేశవాళీ శునకలని పెంచుకోరు...?అవి ఇతర జాతుల కుక్కల్లా మూతి,ముక్కు రకరకాలుగా కలిగి  వుండవనా..?అందంగా వుండవంటే మాత్రం ఒప్పుకోలేము.ఎందుకంటే చూసే దిక్కు లేక వీధుల్లో ఏది దొరికితే అది తిని,ఎక్కడబడితే అక్కడ పడుకుని...ఎండకు ఎండి,వానకు తడిసి ...పాపం అలా తయారవుతాయిగాని -తెలివి విషయంలో గాని ,అందం విషయంలో గాని ,శక్తి విషయంలోగాని అవి ఏ విదేశి కుక్కలకీ తీసిపోవు.

మనం వీధిలో వెళుతున్నప్పుడు చూస్తుంటాము...ఓ గంపెడు పిల్లలని వేసుకొని వెళుతుండే తల్లి కుక్కని..!ఒక్కసారి ఆ కుక్క పిల్లలని బాగా పరిశీలించండి...ఎంత ముద్దుగా,బొద్దుగా,అందంగా ఉంటాయో..!వీటిని యెవరైనా పెంచుకోవాలేగాని యెంత ఠీవీ గా తయారవుతాయోననిపిస్తుంది.కాలం గడుస్తున్నకొద్దీ ఆ బుజ్జి కుక్కపిల్లలే..గజ్జికుక్కలుగా పరిణామం చెందుతాయి.వాటికి పిచ్చి లేచి ఎవరినైనా కరిస్తే గాని మనకి వాటి వునికి పట్టదు.

ఎందుకని మనం వీధి కుక్కలు లేని భారతదేశాన్ని తయారుచేసుకోలేము...నిర్ధాక్షిణ్యంగా వాటిని చంపమని అనడం లేదుగాని కనీసం కుక్కలని పెంచే ఆసక్తి వున్నవాళ్ళైనా ప్రతి ఒక్కరు ఓ కుక్కని పెంచితే వాటిని ఆదరించినవాళ్ళము అవుతాము.మంచి పోషణ ని,ఆహారాన్ని ,శిక్షణని ఆ కుక్కలకి ఇస్తే ప్రపంచం లోని ఏ శునక జాతులకి మనవి తీసిపోవు.ఇకనైనా మన వీధికుక్కలని చిన్న చూపు చూడడం  మానండి.వాటిని పెంచాడాన్ని చిన్నతనంగా భావించకండి. 
                              Click Here For More    



    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి