Pages

30, జులై 2013, మంగళవారం

గోసం రక్షణ అంటూ గోల పెట్టే వారు ఈ పశువుల గతిని ఎందుకు పట్టించుకోరు..?

ఇక్కడ పైన ఒరిస్సా పోస్ట్ అనే ఆంగ్ల దిన పత్రిక లోని ఒక పేజి ని ఇచ్చాను.అది ఈ రోజు పేపరే..!దీంట్లో నన్ను కదిలించింది ఏమిటంటే భువనేశ్వర్ లోని ఒక రోడ్డు మీద మంచి ట్రాఫిక్ లో ఆ ఎద్దులు ఎలా పోట్లాడుకొంటూ జనాలని భీతవాహుల్ని చేస్తున్నాయో చూడండి.ఈ పరిస్తితి అక్కడే వుంది అనుకుంటే పొరబాటు...మన రాష్ట్రంలో కూడా ఇంచు మించు ప్రతి పట్టణంలో ఈ దృశ్యాలు దర్శనమిస్తుంటాయి.ఒక్కోసారి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంటాయి.

రోడ్ల మీదకి ఇలా విచ్చలవిడిగా పశువులని విడిచిపెట్టేవారిమీద అనగా ఆ యజమానుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి.చక్కగా పశువులని వాటి పాలకోసం,బండి కట్టడం కోసం వుపయోగించుకొని పనికి రావనుకున్నప్పుడు వాటి ఆలనా పాలనా పట్టించుకోకుండా ఇలా వదిలిపారేస్తుంటారు.ఇలాంటివారు పశువులు కన్నా హీనం.గోసం రక్షణ అంటూ గోల పెట్టే వారు ఈ పశువుల గతిని ఎందుకు పట్టించుకోరు..? Click here for more     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి