Pages

27, జులై 2013, శనివారం

నటుడు,దర్శకుడు ఉపేంద్ర తీరే వేరు..!




నటుడు,దర్శకుడు ఉపేంద్ర తీరే వేరు.అది సినిమాగాని..నిజజీవితం గాని..!స్వతహాగా కన్నడ రంగానికి చెందినా అతని డబ్బింగ్ సినిమాలు దుమ్ము రేపాయి..మనదగ్గర కూడా..! ఉపేంద్ర సినిమాకి పెట్టే టైటిల్స్ కూడా గమ్మత్తుగా వుంటాయి.A,ఓం,ఉపేంద్ర,H2O ఇలా వుంటాయి.

ఇంతకీ నేను చెప్పవచ్చేది ఏమంటే అతని ఇంటికి పెట్టిన పేరు ఎవరిదో తెలుసా ..!అతని అన్నగారి పేరు మీద.."సురేంద్ర మనే" అనిట.మనే అని అంటే కన్నడం లో ఇల్లు అని అర్ధం..!  ఇవాళ రేపు ఎక్కడ చూసినా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు..అవీ..ఇవీ అనీ..పొసగకుండా వుండే రోజులివి.అలాంటి ఈ రోజుల్లో కూడా తన స్వంత ఇంటికి అన్నయ్య పేరు  పెట్టడం చాలా ఆశ్చర్య పడవలసిన విషయమేగదా..!

ఉపేంద్ర భార్య ప్రియాంకా త్రివేది ఒకప్పుడు మిస్.కలకత్తా అనే విషయం చాలమందికి తెలుసుననుకుంటాను.పై ఫోటోలో ఉన్నది భార్యా పిల్లలు..!  Click here for more

1 కామెంట్‌: